అక్రమాలపై ఉక్కుపాదం
- ఇక రాత్రి 8 దాటితే ఇసుక రవాణా నిషేధం
- నకిలీ వే బిల్లుల లారీలను అడ్డుకున్న అధికారులు
- ఈ బాగోతాన్ని బయటపెట్టిన ‘సాక్షి’
- కలెక్టర్ ఆదేశాలతో అధికారుల చర్యలు
- మళ్లీ ‘మహా’ ఇసుక తుఫాన్
- తాజాగా రెండు క్వారీలకు మహారాష్ట్ర సర్కారు అనుమతి
బోధన్ : మంజీర తీరంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కలెక్టర్ యోగితారాణా ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. బోధన్ మండలంలోని సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సమీపంలోని మంజీర నదికి ఆవతలి ఒడ్డున మహారాష్ట్ర ప్రాంతంలోని ఇసుక క్వారీల నుం చి లారీలు చెక్‌పోస్టు మీదుగా తెలంగాణలోకి వస్తున్నా రుు. ఆ క్వారీల నుంచి నకిలీ వే బిల్లులతో లారీల్లో రవాణా చేస్తున్నారు. ఈ విషయూన్ని ఇటీవల ‘ఇసుకాసురులు బరితెగించారు’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. దీంతో నకిలీ వే బిల్లులు, ఇసుక అక్రమ రవాణ ను కలెక్టర్ సీరియస్ పరిగణించారు.
ఆమె ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఇసుక లారీల వే బిల్లులు తనిఖీ చేస్తున్నారు. సాలూర వద్ద మంజీర నది కొత్త వంతెన సమీపంలో ఆదివారం రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు మహారాష్ట్ర క్వారీల నుంచి వచ్చిన లారీలను నిలిపి వే బిల్లులను తనిఖీ చేశారు. కొన్ని లారీల వద్ద నకిలి బిల్లులను గుర్తించి రవాణాను అడ్డుకున్నారు. వాటిని మహారాష్ట్రకు తిప్పి పంపించారు. బోధన్ టౌన్, రూరల్ సీఐలు వెంక న్న, శ్రీనివాసులు, ఎడపల్లి, వర్ని ఎస్సైలు ఆసిఫ్ అహ్మద్, అంజయ్య, బోధన్ ఎంఆర్‌ఐ అశోక్ సింగ్, వీఆర్‌వో జావిద్ తదితరులు తనిఖీలు నిర్వహించారు.
అక్రమ రవాణా నియంత్రకు చర్యలు...
మంజీర తీరంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝుళింపించారు. మహారాష్ట్ర ఇసుక క్వారీల నుంచి నకిలీ వే బిల్లులు, ఓవర్‌లోడ్‌తో రవాణా చేస్తున్న లారీలను అడ్డుకునేందుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఐదారేళ్లుగా అడ్డూఅదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతున్న విషయం విదితమే. దీనిద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అరుుతే కొత్తగా వచ్చి కలెక్టర్ యోగితా రాణా ఆదేశాలతో అధికార యంత్రాగం ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.
మూడు చెక్‌పాయింట్లు.. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు..
రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల సమన్వయంతో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించినట్టు అధికారులు వెల్లడించారు. నిజాంసాగర్ మండలంలోని రెండు చోట్ల, ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ వద్ద చెక్‌పాయింట్లను ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఇసుక లారీల రవాణను నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘించి రవా ణా చేస్తే వాహనాలను స్వాధీ నం చేసుకుని లారీ యాజమానులపై క్రిమినల్ కేసులు నమో దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ వే బిల్లులతో రవాణా చేసినా చర్యలు తప్పవని ప్రకటించారు.
మళ్లీ ‘మహా’ఇసుక తుఫాన్..
సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సమీపంలో గల మంజీర నది తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తోంది. మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా పరిధిలో మంజీర నదిలో అక్కడి ప్రభుత్వం ఇసుక క్వారీలకు వేలంపాట నిర్వహించి రవాణాకు అనుమతిస్తోంది. వేలంలో క్వారీలు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మన భూబాగంలోని నదిలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తున్న విషయం పలుమార్లు అధికారుల పరిశీలనలో వెలుగుచూసింది. ప్రస్తుతం గంజ్‌గాం క్వారీ కొన్ని నెలలుగా నడుస్తోంది.
తాజాగా కార్లా, ఎస్గీ క్వారీలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని సమాచారం. రెండు రోజులుగా ఈ రెండు క్వారీల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. బోలేగాం క్వారీకి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. దీంతో మళ్లీ మంజీర తీరంలో మహా ఇసుక తుఫాన్ రానుంది. దీని ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కోట్లు దండుకుంటుండగా మన ప్రాంతంలో రోడ్లు దెబ్బతినడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు వట్టిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.