మహిళా, ఎస్సీ/ఎస్టీ ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలి | Have to be women, sc,st as IAS and IPS | Sakshi
Sakshi News home page

మహిళా, ఎస్సీ/ఎస్టీ ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలి

Published Mon, Dec 21 2015 1:22 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

Have to be women, sc,st as IAS and IPS

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత ఎక్కువగా ఉంది. కీలకమైన చాలా విభాగాలకు ఆయా శాఖలపై పట్టున్న అధికారులు లేరు. కొరతను అధిగమించేందుకు కేంద్రం రాష్ట్రాలపై దృష్టి పెట్టింది.  ఎక్కువ మంది మహిళా, ఎస్సీ, ఎస్టీ,, ఓబీసీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను గుర్తించి కేంద్రానికి డిప్యుటేషన్‌పై పంపాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.  డిప్యూటీ సెక్రెటరీ, డెరైక్టర్ స్థాయిలో కొరత ఎక్కువగా ఉందని పేర్కొంది. 

సివిల్ సర్వీసెస్ బోర్డుకు ప్యానెల్ రికమెండ్ చేసిన అధికారులు చివరి దశలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నా, వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నా, కేడర్ నుంచి రిలీవ్ చేసేందుకు నిరాకరించినా.. అటువంటి అధికారులను ఐదేళ్లు సెంట్రల్ డిప్యుటేషన్ నుంచి డిబార్ చేస్తామని, విదేశీ పోస్టుకూ పరిగణనలోకి తీసుకోబోమని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement