ఇటు పెళ్లి లోగిలి.. అటు మృత్యు కౌగిలి | same day as the wedding of the daughter of the father died | Sakshi
Sakshi News home page

ఇటు పెళ్లి లోగిలి.. అటు మృత్యు కౌగిలి

Published Wed, Sep 9 2015 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

ఇటు పెళ్లి లోగిలి..  అటు మృత్యు కౌగిలి

ఇటు పెళ్లి లోగిలి.. అటు మృత్యు కౌగిలి

కుమార్తె పెళ్లి రోజే తనువు చాలించిన తండ్రి
కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు, బంధువులు

 
 లక్కిరెడ్డిపల్లె : ఓవైపు కన్న కూతురి పెళ్లి.. మరో వైపు మృత్యువుతో తండ్రి పోరాటం. చివరకు బిడ్డ పెళ్లి చూడకుండానే ఆ తండ్రి కన్ను మూశాడు. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం లక్కిరెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. లక్కిరెడ్డిపల్లెకు చెందిన ముబారక్ తన కుమార్తెకు ఈనెల 7న సోమవారం పెళ్లి జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పెళ్లికి అవసరమైన సామగ్రి తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనంలో వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం రాత్రి వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.

తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా.. పెళ్లికి బంధువులంతా రావడంతో బరువెక్కిన హృదయాలతోనే సోమవారం ఆమె వివాహాన్ని జరిపించారు. అదే రోజు రాత్రి ఆసుపత్రిలో ముబారక్ మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది. వివాహానికి హాజరైన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆ నవవధువు విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ చలించిపోయారు. మృతుడు గృహ నిర్మాణ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తుండటంతో ఆ శాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement