మాజీ ఎంపీ ఫాంహౌస్‌కు నల్లా కనెక్షన్ కట్
మొయినాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఓ మాజీ ఎంపీ తన వ్యవసాయక్షేత్రానికి వేసుకున్న మంజీర పైపులైన్‌ను అధికారులు సోమవారం తొలగించారు. మండల పరిధిలోని చందానగర్ పంచాయతీ అనుబంధ గ్రామమైన రెడ్డిపల్లి వద్ద ఉన్న తన ఫాంహౌస్‌కు సదరుప్రజాప్రతినిధి నీటిని తరలించేందుకు అక్రమంగా కనెక్షన్ తీసుకున్నదానిపై ఆదివారం పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిం దే. దీంతో సోమవారం ఆర్‌డబ్ల్యూఎస్ చేవెళ్ల డివిజన్ డీఈ రాజేష్, మొయినాబాద్ మండల ఇన్‌చార్జ్ ఏఈ శ్రీనివాస్‌లు అక్కడికి చేరుకుని అనుమతులు లేకుండా కనెక్షన్ ఎలా తీసుకుం టారంటూ వ్యవసాయక్షేత్ర సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డీఈ రాజేష్ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రమే వర్క్‌ఇన్‌స్పెక్టర్‌తో అక్రమ కనెక్షన్‌ను తొలగించినట్లు తెలిపారు. ఫాంహౌస్‌కు మంజీరా నీటి కనెక్షన్ ఇవ్వాలని తమ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపామన్నారు. దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన పైప్‌లైన్ వేసుకుని కనెక్షన్ తీసుకోవడం సరికాదన్నారు. అయితే మొదటితప్పుగా భావించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మళ్లీ ఇలా అక్రమ కనెక్షన్ తీసుకుంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.