నిర్ణయించిన వైద్య ఆరోగ్య శాఖ
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు పొందిన రోగులకు ఇక నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) లోనే మందులను అందజేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలు వైద్యసేవలు పొందుతున్నారు. గుండె, కిడ్నీ వంటి శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న వారికి క్రమం తప్పకుండా వాడాల్సిన మందులను అవసరాన్ని బట్టి ఆరోగ్యశ్రీ ద్వారా అందజేస్తున్నారు. అయితే వైద్య సాయం పొందిన ఆస్పత్రి నుంచే మందులు తీసుకోవాల్సి వస్తోంది.
దీంతో పట్టణాలు, నగరాల్లో ఉన్న ఆస్పత్రులకు వెళ్లడం గ్రామీణ ప్రాంతాల వారికి భారంగా మారుతోంది. దీన్ని నివారించేందుకు రోగికి సమీపంలోని పీహెచ్‌సీల్లోనే అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఆ పీహెచ్‌సీ పరిధిలో ఎంతమంది ఆరోగ్యశ్రీ రోగులున్నారు, వారికి చేసిన చికిత్సలేంటి, ఏ మందులు వాడుతున్నారు, వంటి వివరాలను పీహెచ్‌సీలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రోగులకు మందులు సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
పీహెచ్‌సీల్లోనే ఆరోగ్యశ్రీ రోగులకు మందులు!
Published Sat, Nov 7 2015 12:16 AM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM
Advertisement
Advertisement