నిలువు దోపిడీ | Robbery | Sakshi
Sakshi News home page

నిలువు దోపిడీ

Published Mon, Aug 24 2015 3:43 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

నిలువు దోపిడీ

నిలువు దోపిడీ

 ‘సెకండ్ హ్యాండ్ బైక్’ పేర కుచ్చుటోపీ
 
♦  ఫైనాన్స్ వ్యాపారుల మాయాజాలం
♦  రూ.కోట్లలో గుట్టుగా వ్యాపారం
♦ పుట్టగొడుగుల్లా దుకాణాలు
♦ చోద్యం చూస్తున్నఅధికారులు
 
 ఈజీ ఫైనాన్స్ ముసుగులో రూపాయికి రూపాయి.. వడ్డీలకు చక్రవడ్డీ.. ఏ చట్టానికి చిక్కకుండా గుట్టుగా వ్యాపారం.. ఆటోమొబైల్ వ్యాపారంలో బడా ఆర్థిక నేరం... బడుగులే టార్గెట్.. యువత కోరికలు, బలహీనతలే కాసులు కురిపిస్తున్నాయి.. పల్లెలకు సైతం విస్తరించిన సెకండ్  హ్యాండ్ బైక్ ఫైనాన్స్ సంస్థలపై ‘సాక్షి’ కథనం..
 
 తూప్రాన్ : పట్టణానికి చెందిన రాజు ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. పనిలో భాగంగా అక్కడక్కడా తిరగాలి. అరకొర వేతనంతో బైక్ కొనాలంటే కష్టం.. స్థిరాదాయం లేనందున మోటారు సైకిల్ కొనుగోలుకు అప్పిచ్చేవారు లేరు. రాజే కాదు.. ఇలా చాలామంది ఉన్నారు. ఇటువంటి వారి అవసరాలను సొమ్ము చేసుకోవడానికి బైక్ ఫైనాన్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. సామాన్యుడికి సులువుగా అప్పులిచ్చి నిలువు దోపిడీ చేస్తున్నాయి. అసలు వ్యాపారులు హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించి బ్రాంచీలుగా పల్లెల్లో నిరుద్యోగ యువకులను ఏజెంట్లుగా పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నారు.

 పుట్టగొడుగుల్లా షాపులు
 ప్రతి మండల కేంద్రంలోనూ కనిపిస్తున్న షాపులు సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్‌లే. ఇవి.. చిన్నచిన్న వ్యాపారులు, రోజువారి కూలీలు, చిరుద్యోగులు, దిగువస్థాయి, మధ్యతరగతి యువకులు, విద్యార్థులకు ఎలాంటి షరతులూ లేకుండా కేవలం ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులతో సెకండ్ హ్యాండ్ బైక్‌లను నెలవారి చెల్లింపుల పద్ధతిలో అమ్ముతున్నాయి. దీంతో ఈ వర్గాల జనానికి బైక్ ముచ్చట తీరుతోంది. కానీ బైక్ తీసుకున్నాక అసలు కష్టాలు మొదలవుతున్నాయి. బైక్ సొం తం చేసుకోవాలనే కుతూహలంతో ఫైనాన్సియ ర్లు చెప్పిన చోటల్లా కొనుగోలుదారులు సంతకాలు చేసేస్తున్నారు. దీంతో బైక్ మీద వీరికి ఎటువంటి హక్కూ లేకుండాపోతోంది.

నెల వా యిదా ఆలస్యమైతే ఈ మొత్తం రోజు వారి వడ్డీ కింద వ్యాపారులు లెక్కిస్తారు. వాయిదా వసూలుకు ఎన్నిసార్లు వస్తే అంత వసూలు చార్జీలు అ దనంగా చెల్లించాలి. ఇదంతా అప్పడికప్పుడు తె లియదు. వాయిదాలన్నీ తీరాక బైక్ ఆర్‌సీ బుక్ అడిగితే ఇవన్నీ లెక్కగట్టి ఆఖర్లో చెప్తారు. అప్పు డు లబోదిబోమన్నా లాభం లేదు. ఎందుకంటే బైక్ హక్కులు తమ పేరున లేకపోవడంతో నోరెత్తకుండా చెల్లించి బయటపడుతున్నారు.

 ఇది మరో రకం దందా..
 ధరలో పాతికి శాతం డబ్బు కడితే బైక్ ఇస్తున్నా రు. తర్వాత రెండు వాయిదాలు సరిగా కట్టకపోతే బైక్‌ను ఫైనాన్సియర్ మనుషులు స్వాధీనం చేసుకుంటారు. ఇటువంటి సందర్భంలో ముందు చెల్లించిన పాతిక శాతం డబ్బు వెనక్కి ఇవ్వరు. ఇలా చోరీ వాహనాలు, ప్రమాదాలకు గురైన వాహనాలను సైతం సులువుగా అంటగట్టి మరింత సొమ్ము చేసుకుంటున్నారు.

 దారితప్పుతున్న విద్యార్థులు
 చాలామంది యువకులు కాలేజీలకు బైక్‌లపైనే వెళ్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు కొనే పరి స్థి తి లేకున్నా, ఒత్తిడి చేయడంతో ఫైనాన్స్‌ల్లో బైక్ లు ఇప్పిస్తున్నారు. తీరా కొన్ని నెలల పాటు ఫై నాన్స్ డబ్బులు కట్టకపోయేసరికి విద్యార్థుల ఇళ్ల వద్ద ఫైనాన్సియర్లు గొడవ చేస్తే పరువుపోతుం డడంతో పుస్తెలు తాకట్టు పెట్టి అప్పులు తీర్చిన దాఖలాలున్నాయి. బైక్ అనేది గ్రామాల్లో స్టేటస్ సింబల్‌గా మారడంతో చాలామంది వీటి ని సొంతం చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థల ఉ చ్చులో పడిపోతున్నారు. ఇక, ఇలా విక్రయిస్తు న్న బైక్‌ల్లో దొంగ వాహనాలూ ఉంటున్నాయి. వీటికి నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. పోలీసులకు పట్టుబడినప్పడే ఇది వెలుగుచూస్తోంది.  

 పట్టించుకోని అధికారులు: ఫైనాన్స్ వ్యాపారానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ఎంత వడ్డీ గుంజుకున్నా ఇచ్చేవాడి ఇష్టం, తీసుకునే వాడి అవసరం అన్నట్లు ఉం టుంది. సెకండ్ హ్యాండ్ బైక్ అయినప్పటికీ త క్కువకు కొని ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. ఈ లావాదేవీలపై ఎటువంటి పన్ను లెక్కలోకి రావడంలేదు. వడ్డీపై లాభాలు వస్తున్నా ఇది కూడా ఐటీ శాఖ పరిధిలోకి రావడంలేదు. పెద్దపెద్ద షోరూంలు ఏర్పాటు చేస్తున్నా కస్టమ్స్ శాఖ గానీ, వాణిజ్య పన్నుల శాఖ గానీ, ముస్సిపాలిటీ, పంచాయతీలు చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ఈ వ్యాపారం మాఫియాలా మారి దోపిడీకి తెడబడుతోంది.  
 
 గ్యారెంటీలు అవసరం లేదు
 పాత వాహనాలు విక్రయించేటప్పుడు తీసుకోవాల్సిన  నిబంధనలు మా వద్ద ఉన్నాయి. కొనుగొలుదారుల నివాస ధ్రువపత్రాలు మాత్రమే పరిశీలిస్తాం. ముందస్తు బ్యాంకు చెక్కులు ఇస్తే చాలు. గ్యారంటీలు అవసరం లేదు. ఒకరిని జమానత్‌గా తీసుకుంటాం. మొదట వ్యాపారం నిర్వహించేందుకు స్థానిక గ్రామ పంచాయతీలో లెసైన్స్ పొందుతాం. ఫైనాన్స్ వ్యాపారం కావడంతో ఇన్‌కంటాక్స్ మాత్రమే చెల్లిస్తాం.
 -ఓ వ్యాపారి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement