automobile business
-
ఛార్జింగ్ పెట్టాల్సిన పనేలేదు.. 60 కిమీ రేంజ్ ఇస్తుంది
-
ఆఫర్లు పెట్టినా.. కార్ల అమ్మకాలు డౌన్!
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈ ఏడాది ఆటోమొబైల్ రంగాన్ని కొంతమేర నిరాశకు గురిచేసింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ద్విచక్ర వాహన విక్రయాలు ఆశాజనకంగానే ఉన్నా కార్ల అమ్మకాలు తగ్గాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం అమ్మకాలు పెరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు అమ్మకాలు ఉన్నా, లేకున్నా అక్టోబర్‌పైనే ఆశలు పెంచుకొనే డీలర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మార్కెట్ కార్యకపాలు నెమ్మదించడం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడం వల్ల కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల విక్రయాలు తగ్గినట్లు చెబుతున్నారు. గతేడాది కంటే ఈసారి 15 నుంచి 20 శాతం తగ్గుదల ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ గతేడాదితో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ఆదాయంలో బైక్‌లపైనే ఎక్కువ.. మొత్తంగా వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ జీవితకాలపన్ను రూపంలో ఆర్టీఏకు వచ్చే ఆదాయంలో బైక్‌లపైనే ఎక్కువగా వచ్చింది. కార్లపై దాదాపు స్థిరంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లు ఉన్నాయి. వాటితో పాటు మరో 50కి పైగా అనుబంధ షోరూమ్‌లు ఉన్నాయి. సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతిరోజు 1500 నుంచి 2,000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావించే ప్రతిఒక్కరూ దసరా రోజులను శుభప్రదంగా భావిస్తారు. మరోవైపు దసరా సందర్భంగా ప్రకటించే ఆఫర్లు కూడా వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కానీ ఈసారి కార్లపైన గరిష్టంగా రూ.లక్ష వరకు తగ్గింపు ఇచ్చినా ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని పలువురు డీలర్లు అన్నారు.బైక్ ఓకే.. బైక్‌ల అమ్మకాలు మాత్రం గతేడాది కంటే పెరిగాయి. గత సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ నుంచి 24 వరకు 32,306 ద్విచక్ర వాహనాలను విక్రయించగా, ఈ అక్టోబర్ 3వ తేదీ నుంచి 13 వరకు 35,475 బైక్‌లు అమ్ముడయ్యాయి. సుమారు 3,169 ద్విచక్రవాహనాలను అదనంగా విక్రయించారు. ‘ఆటోమొబైల్ రంగానికి దసరా లైఫ్ వంటిది. అలాంటి దసరా ఈ సారి తీవ్రంగా నిరాశపర్చింద’ని తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్కోటేశ్వర్రావు చెప్పారు.చదవండి: ఓలాపై ఫిర్యాదుల వెల్లువ.. తగ్గుతున్న ఈవీల విక్రయాలు..ఆటోమొబైల్‌పై ప్రభావం ఆటోమొబైల్‌పై కూడా ఈ ప్రభావం ఈసారి స్పష్టంగా ఉంది. గత సంవత్సరం దసరా సందర్భంగా 10 రోజుల్లో 10,878 కార్ల అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సరం అదే కాలానికి 10,139 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏటేటా రెట్టింపు చొప్పున పెరగాల్సిన అమ్మకాలు ఈసారి తగ్గుముఖం పట్టాయి. పైగా ఒకేసారి స్టాక్ తెచ్చి పెట్టుకోవడం వల్ల నష్టంగానే భావిస్తున్నాం’ అని సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ షోరూమ్ డీలర్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ వాహనాల్లోనూ చాలా వరకు రూ.20 లక్షలలోపు వాహనాలే ఎక్కువ. హైఎండ్ కేటగిరికి చెందినవి తక్కువే. వివిధ రకాల బ్రాండ్లకు చెందిన కార్లపైన రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ప్రోత్సాహకాలను ఇచ్చారు. గరిష్టంగా కొన్నింటిపైన రూ.లక్ష వరకు రాయితీ లభించింది. అలాగే రెండేళ్ల బీమా డబ్బులను కూడా డీలర్లే భరించారు. అయినప్పటికీ అమ్మకాలు పెరగలేదు. -
భారత్‌లో మరో ఈవీ దిగ్గజం.. కార్ల తయారీ దిశగా అడుగులు!
ఆసియా దేశమైన వియత్నామీస్ ఆటోమొబైల్ దిగ్గజం విన్ఫస్ట్ ఆటో భారత్‌లో ఈవీ కార్లను తయారు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తమిళనాడులో రెండు ప్రాంతాలను ఎంపిక చేసుకుంది. ఈ రెండు ప్రాంతాల్లో కార్లను మ్యానిఫ్యాక్చరింగ్ చేసేలా యూనిట్లను నెలకొల్పితే ఎలా ఉంటుందనే అంశంపై చర్చిస్తుంది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాల దిగ్గ ఆటోమొబైల్ కంపెనీలు ఇక్కడే వాహనాల్ని తయారు చేసి అమ్మాలని భావిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం.. విన్ఫస్ట్కి చెన్నైకి ఉత్తరాన ఉన్న మనలూర్ ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలలో ఒకటైన టుటికోరిన్లో ల్యాండ్‌ను చూపించారు రాష్ట్ర అధికారులు. ఆఫీస్ నిర్వహణ కోసం ప్లాట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో భారతదేశంలో తయారీ కేంద్రాన్ని స్థాపించాలనే ఉద్దేశాన్ని ధృవీకరించిన కంపెనీ, 2026 నాటికి వాహనాలను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించే లక్ష్యంతో సుమారు 200 మిలియన్లను పెట్టుబడి పెట్టనుంది. విన్‌ఫాస్ట్ తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడు తర్వాత గుజరాత్‌ను ఎంపిక చేసుకుందని అక్కడ కూడా స్థల అన్వేషణలో ఉందని సమాచారం. ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థగా పేరున్న ఈ కంపెనీకి భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించడం మరింత ఉపయోగకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఈ జీతంతో బతికేదెలా..? బతుకు బండికి బ్రేక్..
చెన్నై : ఆటోమొబైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం తీవ్రస్ధాయికి చేరుకుంది. కార్లు, బైక్‌లతో పాటు కమర్షియల్ వాహన విక్రయాలు పడిపోవడంతో ఆటోమొబైల్ కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. మారుతి సుజుకి ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేయగా, ఆటో దిగ్గజం అశోక్ లేలాండ్ ఈ నెలలో 5 నుంచి 18 రోజుల పాటు ప్లాంట్ల మూసివేతతో ఉత్పత్తిలో కోత విధించింది. అశోక్ లేలాండ్ నిర్ణయంతో ఆయా ప్లాంట్లలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. కంపెనీ నిర్ణయంతో సెప్టెంబర్‌లో తనకు రూ 13,000 రావాల్సి ఉండగా కేవలం రూ 4000 మాత్రమే చేతికి అందుతాయని చెన్నైలోని ఎన్నోర్ ప్లాంట్‌లో పనిచేసే మురళి అనే కాంట్రాక్టు కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం తన ఇంటి అద్దెకు మాత్రమే సరిపోతాయని చెప్పుకొచ్చాడు. జీతం డబ్బుల్లో కోత పడుతుండటంతో తన పది నెలల చిన్నారితో పాటు తన భార్యను ఆమె పుట్టింటికి పంపానని తనకు పూర్తి జీతం రూ 13,000 వచ్చినా తాను కుటుంబాన్ని నెట్టుకురాలేకపోతున్నానని, ఆ జీతంలోనూ కోతపడితే తాను ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. చెన్నై ప్లాంట్‌లోనే మురళి వంటి కాంట్రాక్టు కార్మికులు మూడు వేల మంది వరకూ పనిచేస్తున్నారు. వీరంతా నో వర్క్..నో వేజెస్ ప్రాతిపదికనే పనుల్లో కొనసాగుతున్నారు. ఈ జీతంతో బతికేదెలా..? శాశ్వత ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధిస్తున్నారని..అలవెన్సులు, ఇన్సెంటివ్ల్లోనూ కోత పెట్టేందుకు కంపెనీ సన్నద్ధమవుతోందని సురేష్ అనే మరో ఉద్యోగి వాపోయారు. తనకు స్కూలుకు వెళ్లే ఇద్దరు పిల్లలున్నారని, నెలవారీ బడ్జెట్లో భారీ కోత పడితే ఎలా బతకాలని ఆందోళన వ్యక్తం చేశారు. తాము రోజుకు రెండు పాల ప్యాకెట్లకు బదులు ఒక ప్యాకెట్‌తోనే సర్ధుకుంటున్నామని, గతంలో వారానికి రెండు సార్లు మాంసాహారం తీసుకునేవాళ్లమని, ఇప్పుడు ఒకసారికే పరిమితమవుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ నెలలో తమకు కేవలం ఎనిమిది రోజులే పని ఉందని, 16 రోజులు సెలవలు ఇచ్చారని వచ్చే నెల అంటేనే తాము భయపడుతున్నామని ఆవేదన చెందారు. పరిహారం ప్రకటించాలి పనిలేక పస్తులుంటున్న కార్మికులకు పరిహారం ప్రకటించి ఆదుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయరామన్ అశోక్ లేలాండ్‌ను కోరారు. గత ఏడాది కంపెనీకి రూ 1983 కోట్ల లాభం వచ్చిందని..ఇక సంక్షోభం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. కంపెనీ తమ కోసం, తమ వాటాదారుల కోసం లాభాలు దండుకోవాలని చూస్తూ కార్మికుల ప్రయోజనాలను గాలికివదిలేసిందని మండిపడ్డారు. మరోవైపు అశోక్ లేలాండ్ వాహన విక్రయాలు సగానికి పైగా పతనమయ్యాయి. గత ఏడాది ఆగస్ట్‌లో 16,628 వాహనాలు విక్రయించగా, ఈ ఏడాది ఆగస్ట్‌లో వాహన విక్రయాలు 50 శాతం పడిపోయి కేవలం 8,296 యూనిట్లకు పరిమితమయ్యాయి. నోట్ల రద్దు, జీఎస్టీ, భారత్ సిక్స్ ప్రమాణాలకు మారడం, ఎలక్ర్టానిక్ వాహనాలకు ప్రోత్సాహం వంటి కారణాలతో ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది. ఆటోమొబైల్ పరిశ్రమపై విధించే 28 శాతం జీఎస్టీని తగ్గించాలని, ఎలాంటి నియంత్రణలు లేకుండా వాహన రుణాలను విరివిగా మంజూరు చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. -
మేలోనూ కారు రివర్స్‌గేరు!
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం గతుకుల రోడ్డుపై ప్రయాణం కొనసాగిస్తోంది. అధిక ఫైనాన్స్ వ్యయం, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) తగ్గిపోవడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మే నెలలో కూడా అమ్మకాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ రంగంలోని మార్కెట్ లీడర్లు విక్రయాలు సైతం 20 శాతానికి మించి దిగజారాయి. ఆయా కంపెనీలు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గత నెలలో మారుతీ సుజుకీ ఇండియా మొత్తం అమ్మకాలు ఏకంగా 22 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ విక్రయాలు 26 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 3 శాతం తగ్గిపోయాయి. ఈ అంశంపై మాట్లాడిన మహీంద్రా ఆటోమోటివ్ విభాగ ప్రెసిడెంట్ రాజన్ వాదేరా.. ‘సాధారణంగా ఎన్నికలకు ముందు ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గుతాయి. మరోవైపు హైబేస్ నంబర్, అధిక ఫైనాన్స్ వ్యయం ఉన్నందున గత నెలలో సేల్స్ భారీగానే తగ్గాయి’ అని వివరించారు. వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలి పరిశ్రమ డిమాండ్ న్యూఢిల్లీ: వాహన అమ్మకాల క్షీణతకు ముగింపు పలికేందుకు గాను అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఈ సూచన చేయడం గమనార్హం. అలాగే, కాలుష్య నిరోధానికి గాను పాత వాహనాలను తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా కోరింది. బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక శాఖ అధికారులకు సియామ్ ఈ మేరకు తమ డిమాండ్లను వినిపించింది. జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల వాహనాల ధరలు దిగొస్తాయని, దాంతో 11 నెలలుగా అమ్మకాలు మందగించిన పరిశ్రమలో డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొంది. దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునే వాణిజ్య వాహనాలపై కస్టమ్స్ డ్యూటీని ప్రస్తుత 25 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని కూడా సియామ్ కోరింది. -
నిలువు దోపిడీ
‘సెకండ్ హ్యాండ్ బైక్’ పేర కుచ్చుటోపీ ♦ ఫైనాన్స్ వ్యాపారుల మాయాజాలం ♦ రూ.కోట్లలో గుట్టుగా వ్యాపారం ♦ పుట్టగొడుగుల్లా దుకాణాలు ♦ చోద్యం చూస్తున్నఅధికారులు ఈజీ ఫైనాన్స్ ముసుగులో రూపాయికి రూపాయి.. వడ్డీలకు చక్రవడ్డీ.. ఏ చట్టానికి చిక్కకుండా గుట్టుగా వ్యాపారం.. ఆటోమొబైల్ వ్యాపారంలో బడా ఆర్థిక నేరం... బడుగులే టార్గెట్.. యువత కోరికలు, బలహీనతలే కాసులు కురిపిస్తున్నాయి.. పల్లెలకు సైతం విస్తరించిన సెకండ్ హ్యాండ్ బైక్ ఫైనాన్స్ సంస్థలపై ‘సాక్షి’ కథనం.. తూప్రాన్ : పట్టణానికి చెందిన రాజు ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. పనిలో భాగంగా అక్కడక్కడా తిరగాలి. అరకొర వేతనంతో బైక్ కొనాలంటే కష్టం.. స్థిరాదాయం లేనందున మోటారు సైకిల్ కొనుగోలుకు అప్పిచ్చేవారు లేరు. రాజే కాదు.. ఇలా చాలామంది ఉన్నారు. ఇటువంటి వారి అవసరాలను సొమ్ము చేసుకోవడానికి బైక్ ఫైనాన్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. సామాన్యుడికి సులువుగా అప్పులిచ్చి నిలువు దోపిడీ చేస్తున్నాయి. అసలు వ్యాపారులు హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించి బ్రాంచీలుగా పల్లెల్లో నిరుద్యోగ యువకులను ఏజెంట్లుగా పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నారు. పుట్టగొడుగుల్లా షాపులు ప్రతి మండల కేంద్రంలోనూ కనిపిస్తున్న షాపులు సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్‌లే. ఇవి.. చిన్నచిన్న వ్యాపారులు, రోజువారి కూలీలు, చిరుద్యోగులు, దిగువస్థాయి, మధ్యతరగతి యువకులు, విద్యార్థులకు ఎలాంటి షరతులూ లేకుండా కేవలం ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులతో సెకండ్ హ్యాండ్ బైక్‌లను నెలవారి చెల్లింపుల పద్ధతిలో అమ్ముతున్నాయి. దీంతో ఈ వర్గాల జనానికి బైక్ ముచ్చట తీరుతోంది. కానీ బైక్ తీసుకున్నాక అసలు కష్టాలు మొదలవుతున్నాయి. బైక్ సొం తం చేసుకోవాలనే కుతూహలంతో ఫైనాన్సియ ర్లు చెప్పిన చోటల్లా కొనుగోలుదారులు సంతకాలు చేసేస్తున్నారు. దీంతో బైక్ మీద వీరికి ఎటువంటి హక్కూ లేకుండాపోతోంది. నెల వా యిదా ఆలస్యమైతే ఈ మొత్తం రోజు వారి వడ్డీ కింద వ్యాపారులు లెక్కిస్తారు. వాయిదా వసూలుకు ఎన్నిసార్లు వస్తే అంత వసూలు చార్జీలు అ దనంగా చెల్లించాలి. ఇదంతా అప్పడికప్పుడు తె లియదు. వాయిదాలన్నీ తీరాక బైక్ ఆర్సీ బుక్ అడిగితే ఇవన్నీ లెక్కగట్టి ఆఖర్లో చెప్తారు. అప్పు డు లబోదిబోమన్నా లాభం లేదు. ఎందుకంటే బైక్ హక్కులు తమ పేరున లేకపోవడంతో నోరెత్తకుండా చెల్లించి బయటపడుతున్నారు. ఇది మరో రకం దందా.. ధరలో పాతికి శాతం డబ్బు కడితే బైక్ ఇస్తున్నా రు. తర్వాత రెండు వాయిదాలు సరిగా కట్టకపోతే బైక్‌ను ఫైనాన్సియర్ మనుషులు స్వాధీనం చేసుకుంటారు. ఇటువంటి సందర్భంలో ముందు చెల్లించిన పాతిక శాతం డబ్బు వెనక్కి ఇవ్వరు. ఇలా చోరీ వాహనాలు, ప్రమాదాలకు గురైన వాహనాలను సైతం సులువుగా అంటగట్టి మరింత సొమ్ము చేసుకుంటున్నారు. దారితప్పుతున్న విద్యార్థులు చాలామంది యువకులు కాలేజీలకు బైక్‌లపైనే వెళ్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు కొనే పరి స్థి తి లేకున్నా, ఒత్తిడి చేయడంతో ఫైనాన్స్‌ల్లో బైక్ లు ఇప్పిస్తున్నారు. తీరా కొన్ని నెలల పాటు ఫై నాన్స్ డబ్బులు కట్టకపోయేసరికి విద్యార్థుల ఇళ్ల వద్ద ఫైనాన్సియర్లు గొడవ చేస్తే పరువుపోతుం డడంతో పుస్తెలు తాకట్టు పెట్టి అప్పులు తీర్చిన దాఖలాలున్నాయి. బైక్ అనేది గ్రామాల్లో స్టేటస్ సింబల్‌గా మారడంతో చాలామంది వీటి ని సొంతం చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థల ఉ చ్చులో పడిపోతున్నారు. ఇక, ఇలా విక్రయిస్తు న్న బైక్‌ల్లో దొంగ వాహనాలూ ఉంటున్నాయి. వీటికి నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. పోలీసులకు పట్టుబడినప్పడే ఇది వెలుగుచూస్తోంది. పట్టించుకోని అధికారులు: ఫైనాన్స్ వ్యాపారానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ఎంత వడ్డీ గుంజుకున్నా ఇచ్చేవాడి ఇష్టం, తీసుకునే వాడి అవసరం అన్నట్లు ఉం టుంది. సెకండ్ హ్యాండ్ బైక్ అయినప్పటికీ త క్కువకు కొని ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. ఈ లావాదేవీలపై ఎటువంటి పన్ను లెక్కలోకి రావడంలేదు. వడ్డీపై లాభాలు వస్తున్నా ఇది కూడా ఐటీ శాఖ పరిధిలోకి రావడంలేదు. పెద్దపెద్ద షోరూంలు ఏర్పాటు చేస్తున్నా కస్టమ్స్ శాఖ గానీ, వాణిజ్య పన్నుల శాఖ గానీ, ముస్సిపాలిటీ, పంచాయతీలు చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ఈ వ్యాపారం మాఫియాలా మారి దోపిడీకి తెడబడుతోంది. గ్యారెంటీలు అవసరం లేదు పాత వాహనాలు విక్రయించేటప్పుడు తీసుకోవాల్సిన నిబంధనలు మా వద్ద ఉన్నాయి. కొనుగొలుదారుల నివాస ధ్రువపత్రాలు మాత్రమే పరిశీలిస్తాం. ముందస్తు బ్యాంకు చెక్కులు ఇస్తే చాలు. గ్యారంటీలు అవసరం లేదు. ఒకరిని జమానత్‌గా తీసుకుంటాం. మొదట వ్యాపారం నిర్వహించేందుకు స్థానిక గ్రామ పంచాయతీలో లెసైన్స్ పొందుతాం. ఫైనాన్స్ వ్యాపారం కావడంతో ఇన్‌కంటాక్స్ మాత్రమే చెల్లిస్తాం. -ఓ వ్యాపారి -
ఘోరం..
చొప్పదండి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లికి చెందిన షూమార్టు నిర్వాహకుడు మహ్మద్ షఫియుద్దీన్(38) తన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఆసిఫాబాద్‌కు చెందిన సివి ల్ ఇంజినీర్ సయ్యద్ సలావుద్దీన్ అన్సారి(28), ఆటోమొబైల్ వ్యాపారి సయ్యద్ ఖలీద్(28)తో కలిసి నల్గొండ జిల్లాలో శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆసిఫాబాద్ నుంచి శనివారం రాత్రి బయల్దేరారు. సలావుద్దీన్ కారు నడుపుతుండ గా, షఫియుద్దీన్ ముందు సీట్లో, ఖలీద్ వెనుకసీట్లో కూర్చున్నారు. చొప్పదండి మండలం కొలి మికుంట గ్రామపంచాయతీ సమీపంలో మూల మలుపు వద్ద ఆదివారం వేకువజామున కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ సంఘటన స్థలంలోనే చనిపోయారు. మూలమలుపు వద్ద కారు కుడివైపునకు తిరగాల్సి ఉండగా, ఎడమ వైపునకు దూసుకుపోయింది. ఆపై స్టీరింగ్‌ను కుడివైపునకు తిప్పడంతో రోడ్డు పక్కనున్న చిన్న కల్వర్టు పైనుంచి ఎగిరిపడి చెట్టును వేగం గా ఢీకొంది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అక్కడ చెట్టు లేకుంటే కారు పొలంలోకి దూసుకెళ్లి ప్రాణాలు దక్కేవి. మూలమలుపు వద్ద హె చ్చరిక బోర్డు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం, రాత్రివేళ మద్యంమత్తులో మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే మూడు నిండుప్రాణాలు గాలిలో కలిసినట్లు భావిస్తున్నారు. సీఐ విజయసారథి, ఏఎస్సై చంద్రశేఖర్ సంఘటన స్థలం నుంచి మృతదేహాలను కరీంనగర్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించారు. చేతికొచ్చిన కొడుకు.. ఆసిఫాబాద్‌లోని హడ్కో కాలనీకి చెందిన సివిల్ కాంట్రాక్టర్ హకీం అన్సారీకి కుమారుడు సలావుద్దీన్ అన్సారి, ముగ్గురు కుమార్తెలు సంతానం. సలావుద్దీన్ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివాడు. అతడికి 2008లో వివాహమైంది. ప్రస్తుతం సిర్పూర్(టి)లో ఉపాధిహామీ పథకంలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అన్నదమ్ములిద్దరూ రోడ్డు ప్రమాదంలోనే.. కెరమెరి మండలం ధనోరాకు చెందిన సయ్యద్ఖలీద్ ఆసిఫాబాద్‌లో ఆటోమొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. జైనూర్‌కు చెందిన అలియా సుల్తానాతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. అతడి అన్న సాదిక్ ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తూ ఎనిమిదేళ్ల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఖలీద్ తండ్రి అజీజొద్దీన్ అనారోగ్యంతో రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఇప్పుడు కుటుంబానికి ఆధారంగా ఉన్న ఖలీద్ మరణించడంతో తల్లి, భార్యాపిల్లలు అనాథలయ్యారు. దిక్కులేనిదైన కుటుంబం.. బెల్లంపల్లిలోని రాంనగర్‌కు చెందిన మహ్మద్ షఫీయొద్దీన్ తన అన్న రఫీతో కలిసి పాపులర్ షూమార్టు నిర్వహిస్తున్నాడు. షఫీయెద్దీన్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో భార్య రజియా, కొడుకు తౌఫిక్, కూతురు జువేరియా అనాథలయ్యారు. ఇంటినుంచి వెళ్లిన కొద్ది గంటల వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో గుండెలవిసేలా రోదించారు.