

పూర్తిగా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని అప్టేరా మోటార్స్ రూపొందించింది.

ఈ కారుకు ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది సోలార్ వెహికల్.

కారు రూప్ మీద సోలార్ ప్లేట్స్ మాదిరిగా ఉండే నిర్మాణాలు చూడవచ్చు.

ఇది 40 మైళ్ళ పరిధిని అందిస్తుంది (అంటే సుమారు 64 కిమీ దూరం ప్రయాణిస్తుంది).

లోపలున్న బ్యాటరీలు సూర్యుని నుంచే శక్తిని పొందుతాయి. బ్యాటిరీలు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. కాబట్టి బ్యాటరీ పరిమాణాన్ని బట్టి రేంజ్ కూడా మారుతుంది.

వాతావరణం అనుకూలించక, మబ్బులు ఏర్పడినప్పుడు.. ఛార్జ్ చేసుకోవడానికి ప్లగ్ ఇన్ కూడా ఉపయోగించవచ్చు.








