

మార్కెట్లోని ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్ మాదిరిగా కాకుండా.. 'లైట్‌ఫుట్ స్కూటర్' భిన్నంగా ఉంటుంది.

ఇది చూడటానికి ఒక బాక్స్ వలె ఉంటుంది. రెండు వైపులా సోలార్ ప్లేట్స్ ఉంటాయి.

లైట్‌ఫుట్ స్కూటర్‌ను ఆస్ట్రేలియన్ ఇంజనీర్ సాల్ గ్రిఫిత్ రూపొందించారు. ఇందులో 750 వాట్ హబ్ మోటార్ ఉంటుంది.

ఈ స్కూటర్‌లోని లిథియం అయాన్ బ్యాటరీ.. 60 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇరువైపులా ఉన్న సోలార్ ప్యానల్స్ ద్వారా మరో 29 కిమీ రేంజ్ లభిస్తుంది. సోలార్ ప్యానల్స్ సూర్యరశ్మి నుంచి శక్తిని పొందుతుంది.

సోలార్ ప్యానెల్స్ కళ్ళకు ఎటువంటి హాని తలపెట్టవు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 32 కిమీ/గం.

లైట్‌ఫుట్ స్కూటర్ 2.8 ఇంచెస్ ఎల్సీడీ టచ్‌స్క్రీన్ పొందుతుంది. ఇది బ్యాటరీ స్టేటస్, స్పీడ్ వంటి వివరాలను వెల్లడిస్తుంది.

లైట్‌ఫుట్ స్కూటర్ ధర 4995 డాలర్లు (రూ. 4లక్షల కంటే ఎక్కువ). ఈ స్కూటర్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు జనవరిలో ప్రారంభమవుతాయి.

