కొత్త ఆర్మీ చీఫ్ నియామకానికి లైన్ క్లియర్ | Appointment of the new Army Chief   Line Clear | Sakshi
Sakshi News home page

కొత్త ఆర్మీ చీఫ్ నియామకానికి లైన్ క్లియర్

Published Tue, May 13 2014 1:23 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

Appointment of the new Army Chief    Line Clear

న్యూఢిల్లీ: ఆర్మీ కొత్త చీఫ్ నియామకం విషయంలో ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంలో ముందుకే వెళ్లాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ పదవికి వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ పేరును కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)కి రక్షణ శాఖ సిఫారసు చేసింది.

లెఫ్టినెంట్ జనరళ్లలో ఈయనే సీనియర్. ప్రధాని అధ్యక్షతన గల ఏసీసీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల సమయంలో ఆర్మీ కొత్త చీఫ్ నియామకం చేపట్టడంపై బీజేపీ తీవ్రంగా తప్పుపట్టడంతో దీనిపై వివాదం నెలకొంది. ఈ నిర్ణయాన్ని ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలివేయాలని బీజేపీ డిమాండ్ చేయడంతోపాటు దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement