BigBoss 13 Winner Siddharth Shukla To Play Meghnad And Kiccha Sudeep To Play Vibhishan In Prabhas Adipurush - Sakshi
Sakshi News home page

విభీషణుడు.. మేఘనాథుడు?

Published Tue, May 18 2021 1:39 AM | Last Updated on Tue, May 18 2021 9:11 AM

Sidharth Shuklam to play Meghnad to sudeep as vibhishan - Sakshi

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మైథలాజికల్‌ మూవీ ‘ఆదిపురుష్‌’. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. కాగా విభీషణుడి పాత్రకు కన్నడ స్టార్‌ సుదీప్‌ను, రావణుడి కుమారుడు మేఘనాథుడి పాత్రకు బాలీవుడ్‌ యాక్టర్‌ సిద్ధార్థ్‌ శుక్లాను సంప్రదించిందట చిత్రబృందం.

‘‘నన్ను ‘ఆదిపురుష్‌’ చిత్రబృందం సంప్రదించిన మాట వాస్తవమే’’ అని ఇటీవల సుదీప్‌ ఓ సందర్భంలో వెల్లడించారు. అలాగే ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ సిద్ధార్థ్‌ శుక్లాకు ‘ఆదిపురుష్‌’ సినిమా మంచి అవకాశం అని, సో.. ఈ ప్యాన్‌ ఇండియన్‌ మూవీలో నటించే చాన్స్‌ని సిద్ధార్థ్‌ వదులుకోడని బీ టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. మరి.. విభీషణుడిగా సుదీప్, మేఘనాథుడిగా సిద్ధార్థ్‌ శుక్లా కనిపిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

చదవండి: బాలీవుడ్‌ రీమేక్‌.. బెల్లంకొండ బ్రదర్‌తో కృతిశెట్టి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement