గోవిందుడు అందరివాడేలే సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్ లీడ్రోల్లో నక్షత్రం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రుద్రాక్ష, బాలయ్య వందో సినిమా లాంటి ప్రాజెక్ట్స్ మిస్ కావటంతో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి నక్షత్రం సినిమా రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు స్టార్ ఎట్రాక్షన్ తీసుకువచ్చే పనిలో పడ్డాడు కృష్ణవంశీ. అందుకే కన్నడ స్టార్ హీరో సుదీప్ను ఈ సినిమాలో కీలక పాత్రలో నటింపచేయాలని భావిస్తున్నాడు. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సుదీప్, గెస్ట్రోల్ చేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సుదీప్కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించనుంది.
సందీప్ సినిమాలో సుదీప్
Published Tue, May 31 2016 8:22 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM
Advertisement
Advertisement