ఈఎన్‌టీ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ సుదీప్‌  | Telangana: Dr Sudeep Is President Of The ENT Association | Sakshi
Sakshi News home page

ఈఎన్‌టీ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ సుదీప్‌ 

Published Mon, Dec 13 2021 2:27 AM | Last Updated on Mon, Dec 13 2021 2:27 AM

Telangana: Dr Sudeep Is President Of The ENT Association - Sakshi

ఎంజీఎం: వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన ఈఎన్‌టీ వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. చెన్నైలో జరిగిన లైవ్‌ సర్జరీలను ఈ సదస్సులో ప్రదర్శించి.. పలు కొత్త అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించారు. అనంతరం ఈఎన్‌టీ అసోసియేషన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ సుదీప్, ఎలక్ట్‌ ప్రెసిడెంట్‌గా రమణ, ఉపాధ్యక్షులుగా రవిశంకర్, కార్యదర్శిగా రమేశ్, జాయింట్‌ సెక్రటరీగా రవికాంత్, కోశాధికారిగా సాహెల్‌ హమీద్, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా గిఫ్ట్‌సన్, గౌడ రమేశ్, వెంకటరత్నం ఎన్నికయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement