శద్ధ్రాదాస్
ఏంటి.. హెడ్డింగ్‌లో కంగన అని పెట్టి ఇక్కడ హీరోయిన్ శద్ధ్రాదాస్ ఫొటో పెట్టామని ఆలోచిస్తున్నారా? మరేం లేదు. కన్నడ చిత్రం ‘కోటిగొబ్బ 3’లో శ్రద్ధాదాస్ చేస్తున్న పాత్ర పేరు కంగన అని తెలిసింది. ‘కోటిగొబ్బ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం ఇది. సుదీప్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఇంటర్‌పోల్ ఆఫీసర్ కంగన పాత్రలో నటిస్తున్నారు శ్రద్ధాదాస్. బెంగళూరులో షూటింగ్ జరుగుతోంది. ‘‘కోటిగొబ్బ 3 షూటింగ్ గురువారం మళ్లీ ప్రారంభం అయ్యింది. నాకు ఇష్టమైన పాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. శివకార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుదీప్‌నే కథ అందించారట. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనకుంటున్నారు. ‘కోటికొక్కడు’ అనే టైటిల్‌తో ‘కోటిగొప్ప 2’ తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment