‘కలి’ చిత్రంపై నీలి నీడలు | Release date of Kannada movie Kali not confirmed yet | Sakshi
Sakshi News home page

‘కలి’ చిత్రంపై నీలి నీడలు

Published Fri, May 27 2016 8:26 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

‘కలి’ చిత్రంపై నీలి నీడలు - Sakshi

‘కలి’ చిత్రంపై నీలి నీడలు

*భారీ బడ్జెట్‌ అని వెనుకడుగు వేస్తున్నారా?
 *నాలుగు భాషల్లో విడుదల చేస్తామంటున్న దర్శకుడు ప్రేమ్‌


బెంగళూరు: శాండల్‌వుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌ చిత్రంగా చర్చనీయాంశమైన కలి సినిమాపై నీలినీడలు కమ్ముకుంటున్నట్లు గాంధీనగర్‌లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నయి.  శాండల్‌వుడ్‌లో స్టార్‌ హీరోలు శివరాజ్‌కుమార్, సుదీప్‌ హీరోలుగా సుమారు రూ. 100కోట్ల భారీ వ్యయంతో కలి అనే  సినిమా నిర్మిస్తున్నట్లు దర్శకుడు ప్రేమ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే  ఈ సినిమా కథ సుదీప్, శివరాజ్‌కుమార్‌లకు నచ్చలేదని కొందర అనుకుంటుండగా, ఇంత భారీ బడ్జెట్‌ పెట్టడానికి నిర్మాతలు వెనకడు వేస్తున్నారని రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి.

దీనిపై దర్శకుడు ప్రేమ్‌ స్పందిస్తూ సినిమా ఆగిపోలేదని రూ.100కోట్ల బడ్జెట్‌ వ్యయంతో నిర్మిస్తున్నందున ఈ సినిమాను నాలగు భాషలలో విడుదల చేస్తున్నామన్నారు. కథ కూడా సిద్ధమైందని, ప్రస్తుతం పేపర్‌ వర్క్స్‌ జరుగుతున్నాయని తెలిపారు. అంతే కాకుండా చిత్రంలో గ్రాఫిక్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నందున సమయం ఎక్కువ తీసుకుంటుందని తెలిపారు. కాగా శివరాజ్‌కుమార్‌ హీరోగా నటించిన చిత్రాలలో ప్రత్యేకంగా నిలచిన జోగీ సినిమాతో ప్రేమ్‌ శాండల్‌వుడ్‌లో అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement