డీ గ్యాంగ్‌! | Amy Jackson in Mysore shooting | Sakshi
Sakshi News home page

డీ గ్యాంగ్‌!

Nov 26 2017 3:49 AM | Updated on Nov 26 2017 8:08 AM

Amy Jackson in Mysore shooting - Sakshi - Sakshi

అమెరికా నుంచి అమీ జాక్సన్‌ ఇండియా రావాలి. ఓస్‌.. అంతేనా? ఫ్లైట్‌ ఎక్కితే ఇక్కడ ల్యాండ్‌ అయిపోవచ్చు. అంతా సజావుగా జరిగితే అలానే జరుగుతుంది. కానీ, అమీకి వీసా ప్రాబ్లమ్‌ వచ్చింది. దాంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడేమో కన్నడ సినిమా ‘ది విలన్‌’ షూటింగ్‌ ఆగింది. అందులో అమీ నటిస్తున్నారు కదా మరి. ఈ బ్యూటీ రాక కోసం ప్రధాన తారాగాణం శివరాజ్‌ కుమార్, సుదీప్, చిత్రదర్శకుడు కిరణ్‌ కుమార్‌ (స్క్రీన్‌ నేమ్‌ ప్రేమ్‌) వెయిటింగ్‌. ఎట్టకేలకు అమీ వీసా ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయింది. కర్ణాటకలోని మైసూర్‌లో ల్యాండ్‌ అయిపోయారు.

ప్రస్తుతం ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ను మైసూర్‌లో షూట్‌ చేస్తున్నారు. సారీ.. ఒక్క క్షణం ఆగండి. మ్యాటర్‌ చదవడానికి స్మాల్‌ బ్రేక్‌ ఇచ్చి, కింద ఉన్న ఫొటోవైపు ఓ లుక్‌ వేయండి. అక్కడ సుదీప్, ప్రేమ్‌ నోట్లో బిడీ పెట్టుకుని కనిపిస్తున్నారు కదా! ఫొటో గురించి ప్రేమ్‌ మాట్లాడుతూ– ‘‘కేడీ గ్యాంగ్‌ కాదు. బీడీ గ్యాంగ్‌. ఫన్‌ టైమ్‌. షూట్‌ టైమ్‌లో అమీతో కలసి ఇలా ఫొటోకు పోజిచ్చాం. సాంగ్‌ షూట్‌లో భాగంగానే నోట్లో బీడీ పెట్టుకున్నాం. మరోలా అనుకోకండి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం’’ అని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అమీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement