prem
-
డీ గ్యాంగ్!
అమెరికా నుంచి అమీ జాక్సన్ ఇండియా రావాలి. ఓస్.. అంతేనా? ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ ల్యాండ్ అయిపోవచ్చు. అంతా సజావుగా జరిగితే అలానే జరుగుతుంది. కానీ, అమీకి వీసా ప్రాబ్లమ్ వచ్చింది. దాంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడేమో కన్నడ సినిమా ‘ది విలన్’ షూటింగ్ ఆగింది. అందులో అమీ నటిస్తున్నారు కదా మరి. ఈ బ్యూటీ రాక కోసం ప్రధాన తారాగాణం శివరాజ్ కుమార్, సుదీప్, చిత్రదర్శకుడు కిరణ్ కుమార్ (స్క్రీన్ నేమ్ ప్రేమ్) వెయిటింగ్. ఎట్టకేలకు అమీ వీసా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. కర్ణాటకలోని మైసూర్లో ల్యాండ్ అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను మైసూర్లో షూట్ చేస్తున్నారు. సారీ.. ఒక్క క్షణం ఆగండి. మ్యాటర్ చదవడానికి స్మాల్ బ్రేక్ ఇచ్చి, కింద ఉన్న ఫొటోవైపు ఓ లుక్ వేయండి. అక్కడ సుదీప్, ప్రేమ్ నోట్లో బిడీ పెట్టుకుని కనిపిస్తున్నారు కదా! ఫొటో గురించి ప్రేమ్ మాట్లాడుతూ– ‘‘కేడీ గ్యాంగ్ కాదు. బీడీ గ్యాంగ్. ఫన్ టైమ్. షూట్ టైమ్‌లో అమీతో కలసి ఇలా ఫొటోకు పోజిచ్చాం. సాంగ్ షూట్లో భాగంగానే నోట్లో బీడీ పెట్టుకున్నాం. మరోలా అనుకోకండి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం’’ అని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అమీ. -
ఆ రచ్చ మనవాడిదే!
శ్రీకాకుళం రూరల్: రామ్ చరణ్ రచ్చ సినిమాలో ‘మస్తే’ ‘మస్తే’ అంటూ ఓ రకమైన మాడ్యులేషన్‌తో డైలాగ్ చెప్పిన బుడతడు అందరినీ గుర్తుండే ఉంటాడు కదా. ఈ బుడతడు సిక్కోలు వాసే. శ్రీకాకుళంలో మంచి పేరున్న ప్రభాకర్ సిద్ధాంతి మనవడే ఈ ప్రేమ్‌బాబు. రచ్చ సినిమా నుంచి మొదలైన ప్రేమ్‌బాబు ప్ర స్థానం బాలల చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించే వరకు ఎ దిగింది. ఇటీవల జిల్లా పరిషత్‌లోని కాకివీధిలో తన పెదనాన్న విభూతి సూరిబాబు ఇంటికి తన తల్లిదండ్రులతో కలిసి ప్రేమ్‌బాబు వచ్చాడు. ప్రస్తుతం ప్రేమ్ ఏడో తరగతి చదువుతున్నాడు. ఓ వైపు స్టూడెంట్‌గా, మరోవైపు యాక్టర్‌గా రెండు పడవల ప్రయా ణం ఎంచక్కా చేస్తున్నాడీ కుర్రాడు. యాక్టింగ్‌లో ఎలాంటి శిక్షణ లేకపోయినా సినిమాల్లోని ఏదైనా డైలాగ్ చెప్పాలంటే సింగిల్ టేక్‌లోనే ఓకే చేసేస్తున్నాడు. ఓ ఫంక్షన్లో ప్రేమ్బాబును చూసిన దర్శకుడు సంపత్‌నంది తొలిసారిగా ‘రచ్చ’లోని చిన్నప్పటి రామ్‌చరణ్ క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ చిత్రం లోని ఓ రిస్కీ సన్నివేశంలో ప్రేమ్ అదరగొట్టేశాడు. డైలాగులు కూడా బాగా చెప్పడంతో అప్పటి నుంచి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో చిన్నప్పటి ఎన్టీఆర్‌గా ‘టెంపర్’లో నటించాడు. రోగ్ చిత్రంలోనూ బాల నటుడిగా కనిపిం చాడు. శ్రీనువైట్ల డైరెక్షన్లో మిస్టర్ చిత్రంలోనూ మెరిశాడు. ఓ వైపు పెద్ద చిత్రాలు చేస్తూనే మరో వైపు బాలల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. మన్మోహన్ డైరెక్షన్లో ‘బుడు గు’, బీమనేని సుధాకర్ డైరెక్షన్లో ‘ఆదిత్య’ చిత్రాల్లో తన ప్రతిభను చూపించాడు. ప్రశంసలు.. ప్రేమ్‌బాబు నటించిన చిత్రాలకు గాను అమెరి కాలోని ఏంజెల్స్‌లో ఓ సంస్థ ప్రత్యేకంగా సన్మానించింది. ఆదిత్య చిత్రానికి గాను చైనాలో జ్యూరీ అవార్డుతో పాటు రచ్చ చిత్రంలో నట నకు ‘టైమ్స్ఆఫ్ ఇండియా’ అవార్డులను కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా గవర్నర్ నరసింహన్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లు ప్రేమ్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సన్మానించారు. టెంపర్ చిత్రంలో ప్రేమ్‌బాబు నటన చూసిన పూరీ జగన్నాథ్ ‘పులిబిడ్డను కన్నావు’ అంటూ ఇచ్చిన కితాబుతో చాలా ఆనందపడ్డానని తండ్రి రాజేంద్రప్రసాద్ తెలిపారు. -
లక్ష్మిదేవిపల్లిలో మహిళ దారుణ హత్య
వివాహేతర సంబంధమే కారణం : ఎస్పీ సారంగాపూర్ : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మిదేవిపల్లి శివారు గ్రామం ధర్మనాయక్ తండాలో అజ్మీరా పూర్ణ (38) సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు గురైంది. జగిత్యాల ఎస్పీ అనంతశర్మ వివరాల ప్రకారం... అజ్మీరా పూర్ణ భర్త శంకర్‌నాయక్ పదేళ్లక్రితం మృతిచెందాడు. పూర్ణ తన తల్లి అమృతతో ఉంటోంది. జగిత్యాలలోని ఓ టైలరింగ్ దుకాణంలో బట్టలు కుట్టించడానికి తరచూ వెళ్తుండేది. యజమాని చింతకింది శంకర్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనిపై శంకర్ భార్య తర చూ గొడవపడుతోంది. శంకర్‌లో మార్పు రాలేదు. గమనించిన కుమారుడు శైలేజ్ అలియాస్ కిరణ్ (21) జగిత్యాలలో తనతో కరాటే నేర్చుకుంటున్న మిత్రులు వంటిపులి అజయ్(19), మరో మిత్రుడు ప్రేం (19)ల తో కలిసి సోమవారం రాత్రి బైక్‌పై ధర్మనాయక్ తండా కు వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న పూర్ణ, ఆ మె తల్లి అమృతను లేపారు. అమృత ముఖాన్ని గుడ్డ తో కట్టి, పక్కనే ఉన్న రోకలిబండతో పూర్ణ తలపై మోదారు. బలంగా తగలడంతో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందింది. వృద్ధురాలు అమృతను కొట్టడంతో చేరుు విరిగిపోరుుంది. కాగా శైలేష్ తండ్రి రెండురోజుల క్రితం దుబాయ్ వెళ్లాడు. మృతురాలి కూతురు సమత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. శైలేష్, మిగతా ఇద్దరు జగిత్యాలలో డిగ్రీ చదువుతున్నారు. పోలీసుల అదుపులో నిందితులు అమృత బిగ్గరగా అరవడంతో సమీపంలోని వా రి బంధువులు చేరుకొని సారంగాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రణధీర్‌కుమార్ చేరుకున్నారు. నిందితులు పరుగెడుతుండగా అజయ్ వ్యవసాయ బావిలో పడిపోయాడు. శైలేశ్, ప్రేంలు బైక్ తీసుకొని పరారయ్యారు. అజయ్‌ను బయటకు తీసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శైలేష్, అజయ్, ప్రేంలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా నిందితుల్లో మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమచారం. ఎస్పీ వెంట డిఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ శ్రీనివాస్ చౌదరి, ఎస్సైలు రణధీర్‌కుమార్, ఆరోగ్యం ఉన్నారు. -
అరటి తోటలో వ్యక్తి దారుణ హత్య
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం అల్లిపురంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోని అరటి తోటలో ఒంటినిండా గాయాలతో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. వెంటనే సీఐ రవికుమార్, ఎస్సై శ్రీను సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకుక్కునూరు మండలం సీదర గ్రామానికి చెందిన ప్రేమ్(33)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'గెలిచాం.. కానీ అసలైన సాయం ఇప్పుడు కావాలి'
పాట్నా: డబ్బు ఉన్నవాళ్లకు చదువుండదు.. చదువొచ్చేవాళ్లకు డబ్బుండదు అనేది ఒక నానుడి. అయితే, డబ్బున్నవాడు అది అయిపోవడంతో ఆగిపోతాడేమోగానీ.. చదువున్నవాడు మాత్రం డబ్బు హెచ్చుతగ్గలవల్ల ఆగిపోడూ.. ఓ ప్రవాహంలా ముందుకు వెళుతూనే ఉంటాడు. అందుకోసం అనువైన మార్గాలు శోధిస్తాడు. సిగ్గు, బిడియం అనేది దరిచేరనీయరు.. ఎందుకంటే వారి లక్ష్యం ముందు ఇవన్నీ పూచిక పుల్లలు. బీహార్‌లోని మ్యాథమేటిషియన్ అనంద్ కుమార్ ప్రతి ఏటా దాదాపు 30 మంది నిరుపేద పిల్లలకు రూపాయి తీసుకోకుండా ఐఐటీ కోచింగ్ ఇస్తున్నారు. కోచింగ్ తీసుకున్న వారంతా ఫలితాల్లో మెరుస్తున్నారు. అయితే, ఫలితాల్లో తమను విజయం వరిస్తుందన్న సంతోషం కన్నా.. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ ఉంటుంది.. అందుకు భారీ స్థాయిలో ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అసలే రెక్కాడితే డొక్కాడని తమ తల్లిదండ్రులు అంతమొత్తం ఎలా ఇవ్వాగలరనే ఆందోళన బాగా వేదిస్తోంది. దీంతో ఎలాగైన తమ కలను నెరవేర్చుకోవాలని, దేశంలోని విశిష్ట ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదవాలని ఆశపడుతున్నారు. దీంతో వారు తమ పరిస్థితిని ఏమాత్రం తడుముకోకుండా వివరిస్తూ మాకు సాయం చేయండి అంటూ వేడుకుంటున్నారు. ఇలాసాయం కోరుతున్న వారిలో కొందరిని ఉదాహరణగా తీసుకుంటే.. దనంజయ్ కుమార్ (18) అనే విద్యార్థి సూపర్ కంప్యూటర్ 30లో శిక్షణ తీసుకొని ఐఐటీ ర్యాంకు సాధించాడు. అతడు ఇప్పుడు ఖరగ్‌పూర్ ఐఐటీ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలంటే కనీసం 45 వేలు ఫీజు కట్టాలి. పోనీ బ్యాంకులను అడుగుదామా అంటే ప్రవేశం పత్రాన్ని తీసుకొచ్చాకే బ్యాంకులు లోన్ ఇస్తాయి. తన తండ్రి నెలకు సంపాధించేది కేవలం మూడువేల రూపాయలు. కానీ ఇంట్లో ఉంది మాత్రం ఎనిమిది మంది. వీటితో వారందరిని పోషించడమే కష్టం. అలాంటిది 45 వేలు కౌన్సెలింగ్ ఫీజు చెల్లించడమంటే సాధారణమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ధనంజయ్ కుమార్ తనను ఆదుకొని తన కల నెరవేర్చరూ అంటూ వేడుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యే మాదేపూర్ నుంచి సుజిత్ కుమార్, నలందా నుంచి ప్రేమ్ పాల్, ససరాం నుంచి శరవణ్ అనే విద్యార్థులంతా తమకు ఆర్థిక సాయం చేసి విద్యను కొనసాగించేలా ఆదుకోండంటూ కోరుతున్నారు. -
అన్నీ ఆలస్యమేనట!
ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటంటే ఇదేనేమో! బాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాలుగా ట్రైచేసినా పెద్దగా సక్సెస్ వాసన ఎరుగని యాభై రెండేళ్ల సంజయ్‌కపూర్ తన జీవితంలో అన్నీ లేటేనంటూ ఇప్పుడు తెగ ఇదైపోతున్నాడు. స్టార్ హీరో అనిల్‌కపూర్, మెగా నిర్మాత బోనీకపూర్‌ల గారాల తమ్ముడిగా తెరంగేట్రం చేసిన ఇతగాడు... లేటెస్ట్గా బాంబే టైమ్స్‌తో తన బాధ చెప్పుకున్నాడు. 31 ఏళ్లప్పుడు తొలి సినిమా ‘ప్రేమ్’... 35 ఏళ్లకు మహీప్తో పెళ్లి... 38వ ఏట సొంత ఇల్లు... ఇప్పుడు 52వ ఏట నిర్మాతగా మొదటి చిత్రం... ఇలా అన్నీ ఆలస్యంగానే షురూ అయ్యాయట. విషయమేమంటే... సంజయ్ తండ్రి సురీందర్ కపూర్ లైఫ్‌లో కూడా అన్నీ ఇలాగే లేటట. తనకు అదే పోలిక వచ్చిందంటున్నాడు సంజు భాయ్! -
కలల దారిలో..
రాస్తా ఫిలింస్.. బాపురమణల్లాంటి ఇద్దరు స్నేహితుల బ్రెయిన్‌చైల్డ్! వేరువేరు ఊళ్లు, అంతకన్నా వేరైన వీరి నేపథ్యాలను ఒక్కటి చేసింది గువాహటి ఐఐటీ! కలలకు రెక్కలు తొడిగి ఎగిరే శక్తినిచ్చింది ఆ క్యాంపసే! ఆ జోడు పక్షుల పేర్లు.. సాయి, ప్రేమ్. ఈ జంట డ్రీమ్.. సినిమా! దాన్ని నెరవేర్చుకోవడానికి పుట్టిందే రాస్తా ఫిలింస్.. ఆ కథ, స్క్రీన్‌ప్లే ఇది.. ..:: సరస్వతి రమ సాయి ఫ్రమ్ కరీంనగర్, ప్రేమ్.. హైదరాబాదీ! వీళ్ల తల్లిదండ్రుల కలైన ఐఐటీ సీట్‌ను సాఫల్యం చేసి.. గువాహటి ఐఐటీ క్యాంపస్‌లో ఇద్దరూ ఒకేసారి అడుగుపెట్టారు. సాయిది కంప్యూటర్‌సైన్స్ బ్రాంచ్. ప్రేమ్ ఈసీఈ. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో వీరి మధ్య పరిచయం చిగురించింది. ఇద్దరి కామన్ డ్రీమ్ అయిన మూవీ మేకింగ్ వీళ్ల స్నేహానికి కారణమైంది. అప్పటి నుంచి తమ లక్ష్యాన్ని సాధించుకునే పనిలోపడ్డారు. సినిమాలు చూడ్డం, డిస్కస్ చేయడం, ఐడియాలు షేర్ చేసుకోవడం.. ఇలా చదువు పూర్తి కాకముందే మూవీమేకింగ్కు కావల్సిన ప్లాట్‌ఫామ్ కట్టేసుకున్నారు. ఎటొచ్చి సినిమాబండిలో ప్రయాణానికి కావల్సిన టికెట్ డబ్బుల గురించే ఆలోచించడం మొదలుపెట్టారు. చదువైన వెంటనే కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఆ డబ్బులు పదిలం చేసుకోవాలనుకున్నారు. హమ్మయ్య ఎట్ లాస్ట్ ఫ్యూచర్‌పై ఓ క్లారిటీ తెచ్చుకున్నారు. ప్రయత్నమే తరువాయి. మిస్టర్ క్యాబ్మ్యాన్.. అసలే యూత్.. మనసుకి కళ్లెం లేని ఏజ్. అందుకే చదువైపోయేవరకు ఆగనివ్వలేదు వాళ్ల సినిమా కల. ఫోర్త్ ఇయర్లో ఉండగానే వాళ్ల మెదళ్లను తొలిచేసింది. అందుబాటులో ఉన్న వనరులతోనే చిన్న సినిమా తీశారు. అదే మిస్టర్ క్యాబ్మ్యాన్. ఇట్స్ ఎ మ్యూజిక్ వీడియో మూవీ. సినిమా పూర్తి చేయడంతో సంతృప్తి పడలేదు. తమ అభిరుచికున్న సత్తా ఎలాంటిదో తేల్చుకోవాలనుకొని దాన్ని కేరళ ఫిలిం ఫెస్టివల్‌కు పంపారు. అందులో అవార్డు గెలుచుకుని.. వాళ్ల హాబీ సత్తా ఏంటో ప్రూవ్ చేసింది ! ఆ అవార్డే భవిష్యత్ మీద వాళ్ల విశ్వాసాన్ని రెట్టింపు చేసి ఉంటుంది. శామ్సంగ్.. డేటావిండ్.. ముందే అనుకున్నట్టు.. సినిమా బండి టికెట్‌కి పైసలు కూడబెట్టే ప్రయత్నంలో సాయి సామ్‌సంగ్‌లో, ప్రేమ్ డేటావిండ్లో ఉద్యోగాలు సంపాదించారు. కొన్నాళ్లాగి పార్ట్టైమ్ను సినిమా కోసం స్పెండ్ చేయడం మొదలెట్టారు. అఫ్సోస్.. వర్కవుట్‌కాలేదు. జాబ్‌ని కంప్లీట్‌గా పక్కకు పెట్టేద్దామనే నిర్ణయానికొచ్చారు. పేరెంట్స్ నో అన్నారు మూకుమ్మడిగా. కన్విన్స్ చేశారు వేరువేరుగా. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనీ కోసం మీమీద ఆధారపడమని ప్రామిస్ చేశారు. సాలోచనగా సరే అన్నారు అమ్మానాన్నలు. ఏనుగెక్కినంత బలమొచ్చింది అబ్బాయిలకు. రాస్తా ఫిలింస్... అప్పటికే తమలాంటి థింకింగ్, ఎచీవ్మెంట్ పాత్ ఉన్న ఫ్రెండ్స్ దొరికారు వాళ్లకు. తమలోకి ఆహ్వానించారు. ‘రాస్తా ఫిలింస్’ అనే ప్రొడ క్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఫస్ట్ కార్పొరెట్ ఫిలింస్‌తో రీలు నింపడం ప్రారంభించారు. తర్వాత యాడ్ ఫిలింస్కీ విస్తరించారు. తమలాంటి ఫిలిం లవర్స్కీ ఈ బ్యానర్ కింద సినిమాలు తీసుకోవడానికి చాన్స్ ఇస్తున్నారు. రాస్తా స్టూడియోస్నీ స్థాపించి యానిమేషన్‌నూ మొదలుపెట్టారు. ఈ టీమ్‌లో వీరితో పాటు ఇద్దరు డిజైనర్స్, ఓ యానిమేటర్ (అమ్మాయి) కలిపి మొత్తం అయిదుగురు. నో ఎండ్.. ఈ ఎఫర్ట్స్ అనుభవం ఏడాదిన్నరే. బ్రేక్ఈవెన్ రాలేదు.. స్ట్రగులింగ్‌లోనే ఉన్నారు. అయితే ఏం.. ‘బోలెడు ఎక్స్‌పీరియెన్స్ గెయిన్ చేసుకుంటున్నాం.. ఫ్యూచర్ మాదే. ఈ అనుభవంతో డెఫినెట్‌గా మంచి సినిమాలు తీస్తామన్న నమ్మకం ఉంది’ అంటారు వాళ్లు. మంచి సినిమా అంటే అని అడిగితే.. ‘ఇప్పుడొస్తున్న రొటీన్ ఫార్ములాకి డిఫరెంట్‌గా ఉన్న ఫిలింస్నే ప్రొడ్యూస్ చేస్తాం.. డెరైక్ట్ చేస్తాం. ఆ పనిలోనే సీరియస్‌గా ఉన్నాం’ అని చెప్తారు. ఆ మాటలు వాళ్ల చేతలకు ప్రతీకలుగా వినిపిస్తాయి. ఎందుకంటే మొన్న మార్చి 8.. విమెన్స్ డే సందర్భంగా వాళ్లు తీసి, ప్రదర్శించిన ‘గులాబీ గ్యాంగ్ డాక్యుమెంటరీ చెప్తుంది వాళ్ల ప్రతిభేంటో! ‘ఇష్టమైన పనికి కష్టం ఉండదు.. ఓన్లీ ఎచీవ్మెంటే’ అంటుంది రాస్తా ఫిలింస్ టీమ్! ఈ ఇద్దరు ఐఐటీ ప్రొడక్ట్స్ త్రీ ఇడియట్స్ టైప్ కాదు అమ్మానాన్నల కలతో పాటు సొంత డ్రీమ్‌కు డిజైన్ ఇచ్చిన టూ జెమ్స్!