అన్నీ ఆలస్యమేనట! | All alasyamenata! | Sakshi
Sakshi News home page

అన్నీ ఆలస్యమేనట!

Published Sun, Dec 28 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

అన్నీ ఆలస్యమేనట!

అన్నీ ఆలస్యమేనట!

ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటంటే ఇదేనేమో! బాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాలుగా ట్రైచేసినా పెద్దగా సక్సెస్ వాసన ఎరుగని యాభై రెండేళ్ల సంజయ్‌కపూర్ తన జీవితంలో అన్నీ లేటేనంటూ ఇప్పుడు తెగ ఇదైపోతున్నాడు. స్టార్ హీరో అనిల్‌కపూర్, మెగా నిర్మాత బోనీకపూర్‌ల గారాల తమ్ముడిగా తెరంగేట్రం చేసిన ఇతగాడు... లేటెస్ట్‌గా బాంబే టైమ్స్‌తో తన బాధ చెప్పుకున్నాడు.

31 ఏళ్లప్పుడు తొలి సినిమా ‘ప్రేమ్’... 35 ఏళ్లకు మహీప్‌తో పెళ్లి... 38వ ఏట సొంత ఇల్లు... ఇప్పుడు 52వ ఏట నిర్మాతగా మొదటి చిత్రం... ఇలా అన్నీ ఆలస్యంగానే షురూ అయ్యాయట. విషయమేమంటే... సంజయ్ తండ్రి సురీందర్ కపూర్ లైఫ్‌లో కూడా అన్నీ ఇలాగే లేటట. తనకు అదే పోలిక వచ్చిందంటున్నాడు సంజు భాయ్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement