
సాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ లేదనకుండా సహాయం చేయడంలో పైచేయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువ అభిమానిని కలిసి ఆర్థిక సాయం చేయటానికి ముందుకొచ్చారు సుదీప్. బెంగళూరుకు చెందిన 12 ఏళ్ల రాహుల్ అనే బాలుడు బ్రెయిన్ ట్యూమర్, రక్తస్రావం వ్యాధితో పడుతున్నాడు. బాలుడి శస్త్ర చికిత్సకు రూ. 8 లక్షలు ఖర్చువుతాయని వైద్యులు సూచించారు.
రాహుల్ తల్లిదండ్రులు జలందర్ వెల్డర్‌గా పనిచేస్తూ రూ. 4 లక్షలు సమకూర్చుకున్నాడు. మరో మూడు లక్షల అవసరం ఉంది. అయితే రాహుల్ తన అభిమాన హీరో సుదీప్‌కు ట్విట్టర్ ద్వారా సందేశం పంపాడు. దీనిని గమనించి సుదీప్ దానికి సమాధానమిస్తూ స్వయంగా వచ్చి కలవాలని సూచించాడు. దీంతో రాహుల్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ తమకు దేవుడిలా వచ్చి సాయం చేస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment