మరోసారి పవన్ సినిమా రీమేక్లో..! | sudeep and upendra to remake gopala gopala | Sakshi
Sakshi News home page

మరోసారి పవన్ సినిమా రీమేక్లో..!

Published Sat, Nov 21 2015 12:36 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మరోసారి పవన్ సినిమా రీమేక్లో..! - Sakshi

మరోసారి పవన్ సినిమా రీమేక్లో..!

కన్నడలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సుదీప్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో ఘనవిజయం సాధించిన అత్తారింటికి దారేది సినిమాను రీమేక్ చేసి మంచి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు మరో పవన్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సుదీప్.

తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్లు హీరోలుగా తెరకెక్కిన సినిమా గోపాల గోపాల. దేవుడి మీదే కేసు వేసే డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు సుదీప్, ఈ సినిమాలో పవన్ పాత్రలో సుదీప్ నటిస్తుండగా వెంకటేష్ కనిపించిన పాత్రలో విలక్షణ నటుడు ఉపేంద్ర అలరించనున్నాడు. ఇప్పటికే హిందీ, తెలుగు భాషల్లో హిట్ అయిన గోపాల గోపాల, శాండల్వుడ్లో కూడా సంచలనాలు నమోదు చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement