సుదీప్ హీరోగా ముడింజా ఇవన్ పుడి | hero Sudeep Mudinja Ivana Pudi movie shooting second schedule in Chennai | Sakshi
Sakshi News home page

సుదీప్ హీరోగా ముడింజా ఇవన్ పుడి

Published Thu, Oct 1 2015 3:25 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

సుదీప్ హీరోగా ముడింజా ఇవన్ పుడి

సుదీప్ హీరోగా ముడింజా ఇవన్ పుడి

 కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ తమిళంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ముడింజా ఇవన్ పుడి. కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాంబాబు ప్రొడక్షన్స్ పతాకంపై ఎంపీ.బాబు నిర్మిస్తున్నారు. నాన్‌ఈ చిత్రంలో విలనిజాన్ని పండించిన సుదీప్ ఆ తరువాత బ్రహ్మాండ చిత్రం బాహుబలిలో రాజుగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం పులిలో మరోసారి విలన్‌గా సుదీప్ నట విజృంభణ చూడబోతున్నాం. అలాంటి విలక్షణ నటుడు కన్నడ సూపర్‌స్టార్ తమిళంలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ముడింజా ఇవన్ పుడి.
 
  నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పోకిరి, పూజై చిత్రాల ఫేమ్ ముఖేష్ తివారి విలన్‌గా నటిస్తున్నారు. ఎదుర్‌నీశ్చల్, పాండినాడు చిత్రాల్లో ప్రాచుర్యం పొందిన శరత్ లోహితేసువ మరో విలన్‌గా నటిస్తుండగా నాజర్, సాయిరవి, అవినాష్, అచ్చుత్‌కుమార్, లతారావు, సుకన్య, విసు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. రెండవ షెడ్యూల్ చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కోసం అంబత్తూర్‌లో పోలీస్‌స్టేషన్ సెట్ వేసి 10 రోజుల పాటు ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. మరో 30 రోజుల పాటు చెన్నైలోనే ముడింజా ఇవన్ పుడి చిత్ర షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement