బిగ్ బాస్ రియాలిటీ షో భారత్‌లోని దాదాపు అన్ని భాషల్లో ప్రసారం అవుతుంది. ప్రస్తుతం కన్నడలో కూడా ఈ రియాలిటీ షో బిగ్ సక్సెస్ అయింది. తాజాగా ఇందులోని కంటెస్టెంట్ డ్రోన్ ప్రతాప్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. ప్రతాప్ ఆరోగ్యంలో మార్పులు రావడంతో ప్రస్తుతం బెంగుళూరులోని ఆర్‌ఆర్ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఫుడ్ పాయిజన్ వల్ల ప్రతాప్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం డ్రోన్ ప్రతాప్ ఈరోజు బిగ్ బాస్ హౌస్‌కి తిరిగి వస్తాడని బిగ్ బాస్ షో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 9 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షక్ష.. 10వ సీజన్ ఫైనల్‌కు సిద్ధమైంది. అక్కడ హోస్ట్‌గా కిచ్చ సుదీప్ ఉన్న విషయం తెలిసిందే. ఫైనల్‌లో టఫ్ ఫైట్ ఉంటుందని ప్రేక్షకులు ఊహిస్తున్నారు. సీజన్ 10లో ఎవరు గెలుస్తారు? క్యూరియాసిటీ కూడా భారీగా పెరిగింది. టైటిల్ రేసులో డ్రోన్ ప్రతాప్ కూడా ఉన్నాడు. గత వారం బిగ్ బాస్ హౌస్‌కి ప్రతాప్ తల్లిదండ్రులు వచ్చారు. ఆ సమయంలో ఆతను బాగా ఎమోషనల్ అయ్యాడు.. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి.
కర్ణాటకకు చెందిన ప్రతాప్ భారతదేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన 'డ్రోన్ శాస్త్రవేత్త'గా కూడా కీర్తించబడ్డాడు. 14 ఏళ్ల వయస్సులోనే సుమారు 600కు పైగా డ్రోన్స్ తయారు చేశాడు. అతను జపాన్, ఫ్రాన్స్ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డును గెలుచుకున్నాడు. అతను జర్మనీ, USA లలో డ్రోన్‌లపై చేసిన పరిశోధనలకు బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు.
ఒకసారి అతను పాము కాటుకు గురైన ఒక చిన్న అమ్మాయి జీవితాన్ని రోడ్డు మార్గంలో 10 గంటల దూరంలో ఉన్న ప్రదేశానికి యాంటీవినమ్ రవాణా చేసి రక్షించాడు. ఈ దూరాన్ని ఈగిల్ 2.8 డ్రోన్.. దాదాపు 9 నిమిషాల్లో గంటకు 280 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. అలా 10 గంటలు పట్టే సమయాన్ని కేవలం 9 నిమిషాల్లోనే ఆ ఇంజెక్షన్‌ను అందించి ఆ చిన్నారిని కాపాడాడు. అంతేకాకుండా కేరలలో వరదలు వచ్చిన సమయంలో చాలా మందికి ఆహారం,నీళ్లు,మెడిసిన్స్ సరఫరా చేశాడు. అలా అతని పేరు కర్ణాటకలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment