‘రక్తచరిత్ర’, ‘ఈగ’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ హీరో సుదీప్ ప్రస్తుతం ‘బాహుబలి’లో ముఖ్య పాత్ర చేస్తున్నారు. కన్నడంలో ఆయన హీరోగా నటించిన ‘బచ్చన్’ చిత్రాన్ని అదే పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఉదయ్ కె. మెహతా సమర్పకుడు. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్ర చేయడం విశేషం. ఆయన పాత్ర, నటన కన్నడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వచ్చే నెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘కన్నడంలో 15 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం 30 కోట్లు వసూలు చేసింది.
అనువాద హక్కుల్ని ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నాం. సస్పెన్స్, సెంటిమెంట్, యాక్షన్ తదితర అంశాలతో సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. భావన, పరుల్ యాదవ్, తులిప్ జోషి, నాజర్, ‘బొమ్మాళి’ రవిశంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వి. హరికృష్ణ, సాహిత్యం: చల్లా భాగ్యలక్ష్మి, దర్శకత్వం: శశాంక్.
‘బచ్చన్’ ప్రేమలో...
Published Fri, Mar 28 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement
Advertisement