rakta charitra
-
పెనుకొండ నియోజక వర్గంలో రక్త చరిత్ర మొదలు పెట్టిన పరిటాల రవీంద్ర
-
వర్మ సినిమాకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది..
నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే నటి రాధికా ఆప్టే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రక్తచరిత్ర సినిమా సమయంలో తన సమయాన్ని బాగా వాడుకున్నారని, తన పనికి తగ్గ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని చెప్పింది. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర సినిమాలో రాధికా ఆప్టే నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె డీ గ్లామరస్ రోల్లో కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె రక్తచరిత్ర షూటింగ్ సమయంలో తాను ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యాననే ఫీలింగ్ కలిగిందని తెలిపింది. 'నేను మూవీ ఒప్పుకునేటప్పుడు కేవలం తెలుగు వెర్షన్ అని చెప్పారు. అందుకు తగ్గట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు. తీరా సెట్స్‌లోకి వెళ్లాకా సినిమాను తెలుగు, తమిళంలో షూట్ చేశారు. అంటే రెండు సినిమాలకు పనిచేసినట్టే. ఇందుకు తగ్గట్లు గానే నాకు రెమ్యూనరేషన్ ఇవ్వాలి కానీ అలా జరగలేదు. ఇక ఈ సినిమాలో పెద్ద స్టార్స్ నటించడంతో షూటింగ్ కూడా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలిసేది కాదు. ఈ మూవీ కోసం నేను చాలా సమయాన్ని కేటాయించాను. అయితే నా టాలెంట్‌కి, నా సమయానికి విలువ లేదనిపించింది. నిజానికి వర్మ రూపొందించిన రంగీలా, సత్య చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలతో వర్మకు ఫ్యాన్ అయ్యా. అందుకే ఆయనతో పనిచేస్తే కొత్త విషయాలు నేర్చుకోవచ్చని భావించాను. కానీ ఆ తర్వాత మాత్రం రక్త చరిత్ర సినిమాకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది' అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ప్రస్తుతం ఆర్జీవీపై రాధికా ఆప్టే చేసిన ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. చదవండి : అలా ఆమిర్ ఖాన్‌తో మనస్పర్థలు వచ్చాయి: ఆర్జీవీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె -
రక్తచరిత్ర
-
ఇదీ ‘రక్త’చరిత్ర!
విజయనగరం ఆరోగ్యం: మనిషి మాత్రమే రక్తం ఇచ్చి సాటి మనిషిప్రాణాలు కాపాడగలడని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ అధికారులు నిత్యం చెబుతుంటారు. కానీ రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని పూర్తి స్థాయిలో రోగులకు అందించకుండా రెడ్‌క్రాస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్లడ్‌బ్యాంక్‌లో ఉన్న రక్తం వివరాలు గ్రూపుల వారీగా స్టాక్ బోర్డులో పెట్టకుండా బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే పలువురు ఆరోపిస్తున్నారు. రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తానికి హెచ్ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, వీడీఆర్ఎల్, హైపటైటిస్‌బి వంటి వ్యాధుల పరీక్షలు నిర్వహించి రిఫ్రిజిరేటర్లో భద్రపరచాలి. రిఫ్రిజిరేటర్లో ఉన్న రక్తం వివరాలను గ్రూపుల వారీగా స్టాక్ బోర్డుపై నమోదు చేయాలి. ప్రతిరోజూ స్టాక్ ఎంత ఉంది, ఏఏ గ్రూపుల రక్తం ఎంత ఉందనే వివరాలు నమోదు చేయాలి. కానీ ఇక్కడ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బ్లడ్‌బ్యాంక్‌లో రక్త నిల్వలు ఉన్నప్పటికీ రక్తంలేదని స్టాక్ బోర్డులో చూపిస్తున్నారు. బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం ఉన్నప్పటికీ లేదని బోర్డులో చూపించడం వల్ల రోగి బంధువులు రక్తంకోసం నానా అవస్థలు పడుతున్నారు. ఆపదలో ఉన్న రోగులకు రక్తం అందించి ఆదుకోవాల్సిన వారు ప్రాణాలు ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా వ్యవహరిస్తున్నారనే రోగుల బంధువులు వాపోతున్నారు. ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా వ్యవహరిస్తున్నారనే రోగుల గాల్లో కలిసిపోయేలా వ్యవహరిస్తున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. రక్తాన్ని బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు బోర్డులో రక్తం లేదని చూపించి రక్తాన్ని బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఒక్కో బ్యాగ్‌ను రూ.1500 నుంచి రూ.2వేల వరకు విక్రయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన బ్లడ్ బ్యాంక్‌లలోనూ ఇదే పరిస్థితి. ఇదే విషయంపై రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి శ్రీధర్ వద్ద సాక్షి ప్రస్తావించగా బోర్డులో రక్తం వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయని మాట వాస్తవమేనని అంగీకరించారు. అత్యవసర పరిస్థితుల నిమిత్తం 17 బ్యాగ్‌లను ఉంచామని తెలిపారు. -
‘బచ్చన్’ ప్రేమలో...
‘రక్తచరిత్ర’, ‘ఈగ’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ హీరో సుదీప్ ప్రస్తుతం ‘బాహుబలి’లో ముఖ్య పాత్ర చేస్తున్నారు. కన్నడంలో ఆయన హీరోగా నటించిన ‘బచ్చన్’ చిత్రాన్ని అదే పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఉదయ్ కె. మెహతా సమర్పకుడు. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్ర చేయడం విశేషం. ఆయన పాత్ర, నటన కన్నడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వచ్చే నెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘కన్నడంలో 15 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం 30 కోట్లు వసూలు చేసింది. అనువాద హక్కుల్ని ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నాం. సస్పెన్స్, సెంటిమెంట్, యాక్షన్ తదితర అంశాలతో సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. భావన, పరుల్ యాదవ్, తులిప్ జోషి, నాజర్, ‘బొమ్మాళి’ రవిశంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వి. హరికృష్ణ, సాహిత్యం: చల్లా భాగ్యలక్ష్మి, దర్శకత్వం: శశాంక్. -
అద్దంకిలో రక్త చరిత్ర