ఇదీ ‘రక్త’చరిత్ర! | rakta charitra in Vizianagaram | Sakshi
Sakshi News home page

ఇదీ ‘రక్త’చరిత్ర!

Published Wed, Aug 27 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

rakta charitra in Vizianagaram

 విజయనగరం ఆరోగ్యం: మనిషి మాత్రమే రక్తం ఇచ్చి సాటి మనిషిప్రాణాలు కాపాడగలడని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ అధికారులు నిత్యం చెబుతుంటారు. కానీ రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని పూర్తి స్థాయిలో రోగులకు అందించకుండా  రెడ్‌క్రాస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్లడ్‌బ్యాంక్‌లో ఉన్న రక్తం వివరాలు గ్రూపుల వారీగా స్టాక్ బోర్డులో పెట్టకుండా బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే పలువురు ఆరోపిస్తున్నారు. రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తానికి హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, వీడీఆర్‌ఎల్, హైపటైటిస్‌బి వంటి వ్యాధుల పరీక్షలు నిర్వహించి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచాలి. రిఫ్రిజిరేటర్‌లో ఉన్న రక్తం వివరాలను గ్రూపుల వారీగా స్టాక్ బోర్డుపై నమోదు చేయాలి.
 
 ప్రతిరోజూ స్టాక్  ఎంత ఉంది, ఏఏ గ్రూపుల రక్తం ఎంత ఉందనే వివరాలు నమోదు చేయాలి. కానీ ఇక్కడ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బ్లడ్‌బ్యాంక్‌లో రక్త నిల్వలు ఉన్నప్పటికీ రక్తంలేదని స్టాక్ బోర్డులో చూపిస్తున్నారు. బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం ఉన్నప్పటికీ లేదని బోర్డులో చూపించడం వల్ల  రోగి బంధువులు రక్తంకోసం నానా అవస్థలు పడుతున్నారు. ఆపదలో ఉన్న రోగులకు రక్తం అందించి ఆదుకోవాల్సిన వారు ప్రాణాలు  ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా వ్యవహరిస్తున్నారనే రోగుల బంధువులు వాపోతున్నారు.  
 
 ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా వ్యవహరిస్తున్నారనే రోగుల  
 గాల్లో కలిసిపోయేలా వ్యవహరిస్తున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు.
 రక్తాన్ని బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు
 బోర్డులో  రక్తం లేదని చూపించి రక్తాన్ని బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఒక్కో బ్యాగ్‌ను రూ.1500 నుంచి రూ.2వేల వరకు విక్రయిస్తున్నారనే  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  మిగిలిన బ్లడ్ బ్యాంక్‌లలోనూ ఇదే పరిస్థితి. ఇదే విషయంపై రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి శ్రీధర్ వద్ద సాక్షి ప్రస్తావించగా బోర్డులో రక్తం వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయని మాట వాస్తవమేనని అంగీకరించారు. అత్యవసర పరిస్థితుల నిమిత్తం 17 బ్యాగ్‌లను ఉంచామని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement