కొత్త హీరో లైన్లోకొచ్చాడు! | Dhanush signs Sudeep for his next directorial outing? | Sakshi
Sakshi News home page

కొత్త హీరో లైన్లోకొచ్చాడు!

Published Sun, Feb 18 2018 12:18 AM | Last Updated on Sun, Feb 18 2018 12:18 AM

Dhanush signs Sudeep for his next directorial outing? - Sakshi

ధనుష్, సుదీప్‌

చిరంజీవి అన్నారు.. నాగార్జున అన్నారు... కానీ వాళ్లు కాదట.. సుదీప్‌ని కన్‌ఫార్మ్‌ చేశారట. ఏ సినిమా అనుకుంటున్నారా? తేనాండాళ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో  ధనుష్‌ ఓ మల్టీస్టారర్‌ మూవీ రూపొందనుంది. ఇందులో మరో హీరోగా చిరంజీవి, నాగార్జున పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు కొత్తగా కన్నడ హీరో సుదీప్‌ పేరు వినిపిస్తోంది. సుదీప్‌ ఫైనలైజ్‌ అయ్యారట.

ఈ సినిమాతో కనెక్షన్‌ కుదిరే ముందు ధనుష్, సుదీప్‌లకు మరో సినిమాతో కనెక్షన్‌ కుదిరింది. అది ధనుష్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పవర్‌ పాండి’. ఈ సినిమా కన్నడంలో ‘అంబి నింగి వయసాయాతో’ టైటిల్‌తో రీమేక్‌ అవుతోంది. కన్నడ స్టార్‌ అంబరీష్, సుహాసినిలతో పాటు సుదీప్‌ నటిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ధనుష్, సుదీప్‌ల స్నేహం బలపడింది. అందుకే ధనుష్‌ దర్శకత్వం వహించనున్న రెండో సినిమాలో సుదీప్‌ నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement