
కృష్ణుడి గెటప్‌లో సుదీప్
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ప్రధానపాత్రలో నటించ గా హిందీలో ఘనవిజయం సాధించిన ఓ మైగాడ్ చిత్రాన్ని కిచ్చ
కిచ్చ సుదీప్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బైక్
(ఇన్‌సెట్) ముకుందా మురారీ చిత్రంలో కిచ్చ సుదీప్ పోస్టర్
బెంగళూరు: బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ప్రధానపాత్రలో నటించ గా హిందీలో ఘనవిజయం సాధించిన ఓ మైగాడ్ చిత్రాన్ని కిచ్చ సుదీప్, రియల్‌స్టార్ ఉపేంద్రలతో కన్నడలో ముకుంద మురారీ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కిచ్చ సుదీప్ ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కృష్ణుడి వేషధారణలో వేణువుతో ఉన్న సుదీప్ ఫోటోకు అభిమానుల నుంచే కాకుండా శాండల్‌ఉడ్ వర్గాల నుంచి అధ్భుతమైన స్పందన వస్తోంది.
ఈ చిత్రంలో సుదీప్ కోసం రూ.25 లక్షల వ్యయంతో ఓ ప్రత్యేకమైన బైక్ తయారు చేయించామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ముకుంద మురారీ చిత్రం విడుదల కోసం ఉపేంద్ర , కిచ్చ సుదీప్ అభిమానులతో పాటు శాండల్‌ఉడ్ జనాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.