
మా నాన్న కూడా ఇవే వాడారు
ప్రఖ్యాత పాదరక్షల తయారీ సంస్థ ప్యారగాన్ సంస్థ తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా(కర్ణాటకకు) ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు కిచ్చా సుదీప్‌ను ప్రకటించింది.
- ప్యారగాన్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ ‘కిచ్చా సుదీప్’
సాక్షి, బెంగళూరు : ప్రఖ్యాత పాదరక్షల తయారీ సంస్థ ప్యారగాన్ సంస్థ తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా(కర్ణాటకకు) ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు కిచ్చా సుదీప్‌ను ప్రకటించింది. సోమవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్యారగాన్ సంస్థ మార్కెటింగ్ డెరైక్టర్ జోసెఫ్ జక్రియా మాట్లాడుతూ.... తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు కిచ్చా సుదీప్ అంగీకరించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ప్యారగాన్ సంస్థ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆఫీస్ చప్పల్స్ శ్రేణికి ‘టఫ్ అండ్ స్టైలిష్’ నినాదంతో సుదీప్ క్యాంపైన్ చేయనున్నారని తెలిపారు.
అనంతరం నటుడు సుదీప్ మాట్లాడుతూ....తనకు ఏదైనా వస్తువుపై నమ్మకం ఉంటేనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు అంగీకరిస్తానని తెలిపారు. ‘నేను ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నానంటే నేను చెబుతున్నది నమ్మి ఎంతో మంది ప్రజలు ఆ వస్తువును కొనేందుకు ముందుకు వస్తారు. అందువల్ల నేను బ్రాండింగ్ చేసే సంస్థపై ముందుగా నాకు నమ్మకం ఉండాలి. ప్యారగాన్ పాదరక్షలను మా నాన్న వాడడం నేను చూశాను. ’ అని తెలిపారు.