బాహుబలి 2లో సుదీప్ లేడా..? | kiccha sudeep not confirms his role in baahubali 2 | Sakshi
Sakshi News home page

బాహుబలి 2లో సుదీప్ లేడా..?

Published Tue, Aug 16 2016 4:23 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

బాహుబలి 2లో సుదీప్ లేడా..? - Sakshi

బాహుబలి 2లో సుదీప్ లేడా..?

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ విజువల్ వండర్లో నటించేందుకు చాలా మంది అగ్రతారలు ఆసక్తికనబరిచారు. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో నటించిన కన్నడ స్టార్ హీరో సుదీప్ బాహుబలిలో ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. కట్టప్పతో కత్తి యుద్ధంలో ఓడిపోయే అస్లాం ఖాన్ పాత్రలో కనిపించాడు సుదీప్.

అయితే తొలి భాగంలో చిన్న పాత్రే అయినా బాహుబలి పార్ట్ 2లో సుదీప్ పాత్ర ఉంటుందన్న టాక్ బలంగా వినిపించింది. తొలి భాగంలో అస్లాం ఖాన్ చెప్పిన డైలాగ్స్ కూడా రెండో భాగంలో తను కనిపిస్తాడన్న సంకేతాలే ఇచ్చాయి. అయితే తాజాగా ట్విట్టర్లో తన అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన సుదీప్, బాహుబలి 2లో తాను నటించేది లేనిది తెలీదని ప్రకటించాడు. ఇప్పటి వరకు యూనిట్ సభ్యులు తనను సంప్రదించలేదని తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement