
హీరో సుదీప్‌కు తీవ్ర అస్వస్థత
కన్నడ హీరో కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం హెబ్బులి షూటింగ్‌లో హీరో సుదీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మైసూరు : కన్నడ హీరో కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం హెబ్బులి షూటింగ్‌లో హీరో సుదీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం నగరంలో చిత్రీకరణ సమయంలో ఉదయం నుంచి స్వల్ప అస్వస్థతో ఉన్న సుదీప్‌కు సాయంత్రానికి కడుపునొప్పి తీవ్రం వ డంతో సోమవారం ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం ప్రమాదం ఏమీ లేదని గ్యాస్ట్రిక్ సమస్యవల్ల సుదీప్ అస్వస్థతకు గురయ్యాడని యూనిట్ సభ్యులు తెలిపారు. దీంతో షూటింగ్ వాయిదా పడింది.