
'ఏ పార్టీ వాడిని కాదు'
తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని ప్రముఖ నటుడు సుదీప్ స్పష్టం చేశారు.
కోలారు : తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని ప్రముఖ నటుడు సుదీప్ స్పష్టం చేశారు. కేవలం తన ఆప్తుడు సీ.ఆర్. మనోహర్కు మద్దతు తెలపడానికే వచ్చినట్లు తెలిపారు. కర్ణాటకలోని కోలారు - చిక్కబళ్లాపుర్ ఎమ్మెల్సీ స్థానాకి జేడీఎస్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు సుదీప్ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. సుదీప్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సుదీప్ జిందాబాద్ అంటూ అభిమానులు బిగ్గరగా నినాదాలు చేశారు. అభిమానుల ఉత్సాహం చూసిన నటుడు సుదీప్.. వారికి వైపు చేయి ఊపి అభివాదం చేశారు. అనంతరం సుదీప్ విలేకర్లతోపై విధంగా మాట్లాడారు.