పాత్రలో కొత్తదనం ఉంటే చాలు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు సుదీప్. హీరోగానే కాదు.. కథలో తన ప్రాముఖ్యాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా కూడా చేస్తుంటారు. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. తాజాగా సుదీప్ మరో పాత్రకు ‘యస్’ చెప్పారట. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సుదీప్‌ను సంప్రదించారట శంకర్. అది విలన్ పాత్ర అని కోలీవుడ్ టాక్.
సినీ పరిశ్రమలో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకున్న సుదీప్ ప్రస్తుతం విక్రాంత్ రోణ సినిమా చేస్తున్నాడు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment