
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలో కిచ్చ సుదీప్ ఎన్నికల ప్రచారం చేసారు. బీజేపీ అభ్యర్థి ధీరజ్ మునిరాజుకు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్న ఆయన బీజేపీకి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కిచ్చ సుదీప్‌ను చూడడానికి ఆయన అభిమానులు వందల సంఖ్యలో తరలి రావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు తలనొప్పిగా మారింది.