
గాలి జనార్దన్‌రెడ్డికి హారతి పడుతున్న జనం
గంగావతి రూరల్: నగరంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా శుక్రవారం కేఆర్‌పీపీ వ్యవస్థాపకులు, అభ్యర్థి గాలి జనార్దన్‌రెడ్డి మే 10న జరిగే ఎన్నికల్లో పుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి, వేయించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఆయన 19, 20, 21వ వార్డులతో పాటు రాయర్ ఓణి. ఉపకార్ ఓణి, గాంధీసర్కిల్, బసవన్న సర్కిల్ మీదుగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను కలుసుకుని విజ్ఞప్తి చేశారు. నగరంలో మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతిస్తూ ఈ ఎన్నికల్లో మీ విజయం తథ్యం అని ఆశీర్వదించారు. ఈసందర్భంగా వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment