కన్నడ నుంచి కాల్‌ | Entry to Kannada film by Lavanya Tripathi 'The Villan' | Sakshi
Sakshi News home page

కన్నడ నుంచి కాల్‌

Jun 21 2017 12:34 AM | Updated on Sep 5 2017 2:04 PM

కన్నడ నుంచి కాల్‌

కన్నడ నుంచి కాల్‌

కొంతమంది కథానాయికలకు ఓ స్పెషాల్టీ ఉంటుంది. ఫిఫ్టీ ప్లస్‌ హీరోల సరసనా సరిజోడీ అనిపించుకుంటారు.

కొంతమంది కథానాయికలకు ఓ స్పెషాల్టీ ఉంటుంది. ఫిఫ్టీ ప్లస్‌ హీరోల సరసనా సరిజోడీ అనిపించుకుంటారు. థర్టీ ప్లస్‌ హీరోల పక్కనా బాగుంటారు. అలాంటివాళ్లల్లో లావణ్యా త్రిపాఠి ఒకరు. తండ్రి నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నటించిన ఈ పాతికేళ్ల సుందరి ప్రస్తుతం కొడుకు నాగచైతన్య పక్కన నటిస్తున్నారు.

తెలుగులో లావణ్య కెరీర్‌ జోరు మీద ఉంది. అదే జోరుతో తమిళంలో ఇప్పటికే ‘బ్రహ్మ’ అనే సినిమా చేశారు. ఆ తర్వాత అక్కడ చేసిన ‘మాయవన్‌’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పుడు లావణ్య దృష్టి శాండల్‌వుడ్‌ పై పడింది. ‘ది విలన్‌’ చిత్రం ద్వారా కన్నడ చిత్రసీమకు ఎంట్రీ ఇస్తున్నారామె. కన్నడ స్టార్‌ హీరోలు శివరాజ్‌కుమార్, సుదీప్, అమీ జాక్సన్, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రల్లో ప్రేమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement