న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన కన్సూమర్ ఎలక్ట్రిక్ బ్రాండ్ ‘శాన్‌సుయ్’ మళ్లీ భారత్‌లోకి ప్రవేశించనుంది. మొబైల్ హ్యాండ్‌సెట్స్ బ్రాండ్ ‘కార్బన్ మొబైల్స్’ మాతృసంస్థ జైనా గ్రూప్‌తో ఒప్పందం ద్వారా ఇక్కడ మార్కెట్లోకి రీ–ఎంట్రీ కానుంది. ఉత్పత్తి కేంద్ర ఏర్పాటు.. పరిశోధన, అభివృద్ధి నిమిత్తం వచ్చే మూడేళ్లలో రూ. 1,000 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా బ్రాండ్‌ను మళ్లీ ప్రవేశపెట్టనున్నామని జైనా గ్రూప్ గురువారం ప్రకటించింది. ఈ మేరుకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. గతంలో ఈ బ్రాండ్ తయారీ, మార్కెటింగ్ హక్కులను వీడియోకాన్ ఇండస్ట్రీస్ కలిగి ఉంది. అయితే, ఈ కంపెనీ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్రాండ్‌ను జైనా గ్రూప్ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment