Sansui
-
భారత్‌లోకి శాన్సుయ్ బ్రాండ్ రీ–ఎంట్రీ..!
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన కన్సూమర్ ఎలక్ట్రిక్ బ్రాండ్ ‘శాన్సుయ్’ మళ్లీ భారత్‌లోకి ప్రవేశించనుంది. మొబైల్ హ్యాండ్సెట్స్ బ్రాండ్ ‘కార్బన్ మొబైల్స్’ మాతృసంస్థ జైనా గ్రూప్‌తో ఒప్పందం ద్వారా ఇక్కడ మార్కెట్లోకి రీ–ఎంట్రీ కానుంది. ఉత్పత్తి కేంద్ర ఏర్పాటు.. పరిశోధన, అభివృద్ధి నిమిత్తం వచ్చే మూడేళ్లలో రూ. 1,000 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా బ్రాండ్‌ను మళ్లీ ప్రవేశపెట్టనున్నామని జైనా గ్రూప్ గురువారం ప్రకటించింది. ఈ మేరుకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. గతంలో ఈ బ్రాండ్ తయారీ, మార్కెటింగ్ హక్కులను వీడియోకాన్ ఇండస్ట్రీస్ కలిగి ఉంది. అయితే, ఈ కంపెనీ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్రాండ్‌ను జైనా గ్రూప్ చేపట్టింది. -
సాన్సుయ్ ‘హారిజోన్–2’@రూ.4,999
జపాన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ‘సాన్సుయ్’.. ‘హారిజోన్–2’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,999. ఈ స్మార్ట్‌ఫోన్స్ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హారిజోన్–2 స్మార్ట్ ఫోన్లో 2 జీబీ ర్యామ్, 16 బీజీ ఇంటర్నల్ మెమరీ, 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 8 ఎంపీ రియర్ కెమెరా, 2,450 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి వివరించింది. -
ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.4,999
న్యూఢిల్లీ: జపనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సాన్సుయి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. హారిజన్-2 పేరుతో శుక్రవారం లాంచ్ చేసిన ఈ డివైస్ అతి తక్కువ ధరకేఅందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ ఫీచర్తోదీన్ని విడుదల చేసింది. పెన్‌డ్రైవ్‌లు ,ఇతర యూఎస్బీ ఆధారిత ఉపకరణాలకు ఇది సపోర్టు చేయనుంది హారిజన్-2 ఫీచర్స్ 1.2 గిగిహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్7.0 ఆపరేటింగ్ సిస్టం 2జీబీ ర్యామ్ 16జీబీ ఇంటర్నెనల్స్టోరేజ్ 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా పానిక్ బటన్ తోపాటు, పిక్చర్ క్వాలిటీకోసం మిరా విజన్ ఫీచర్ తో బ్లాక్ గ్రే మరియు రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్ లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుందని సాన్సుయి సీవోవో అభిషేక్ మల్పని ఒక ప్రకటనలో తెలిపారు. భారత వినియోగదారుల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్నోవేటివ్ స్మార్ట్ఫోన్ల తయారీకి తాము కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. -
సాన్సూయ్ నుంచి 10 కొత్త టీవీ మోడళ్లు
హైదరాబాద్: జపాన్‌కు చెందిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సాన్సూయ్ భారత్‌లో 10 కొత్త టీవీ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. రెండు సార్లు ఐపీఎల్ చాంపియన్లుగా అవతరించిన కోల్‌కతా నైట్ రైడర్ల(కేకేఆర్)తో తామ మూడేళ్ల భాగస్వామ్య అనుబంధాన్ని పురస్కరించుకొని ఈ కొత్త టీవీ మోడళ్లు... 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ, స్మార్ట్ కనెక్ట్ టీవీ, ఫుల్ హెచ్డీ టీవీలను ను భారత్‌లో ప్రవేశపెట్టామని సాన్సూయ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీవీలను కేకేఆర్ ఆటగాళ్లు.. గౌతమ్ గంభీర్, మోర్నె మోర్కెల్, యుసుఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, బ్రాడ్ హగ్, ఆండ్రె రస్సెల్‌ను ఆవిష్కరించారని సాన్సూయ్ సీఓఓ అమితాబ్ తివారీ పేర్కొన్నారు. ఈ ఏడాది 10 లక్షల ఫ్లాట్ ప్యానెల్ టీవీలను విక్రయించాలని, 10 శాతం మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యాలుగా పెట్టుకున్నామని తెలిపారు. సాన్సూయ్ కర్వ్ 4కే ఎల్ఈడీ టీవీ(165 సెం.మీ.) ధర రూ.2,70,000 అని వివరించారు.