మార్కెట్‌లోకి మళ్లీ స్పైస్ మొబైల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ స్పైస్ భారత మార్కెట్లో రీ–ఎంట్రీ ఇచ్చింది. 8 కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటిలో మూడు స్మార్ట్‌ఫోన్లు కాగా మిగిలినవి ఫీచర్ ఫోన్లు. మొబైల్స్‌పై ఏడాదిపాటు రీప్లేస్‌మెంట్ వారంటీ ఆఫర్ చేస్తోంది. ధరల శ్రేణి రూ.1,180 నుంచి రూ.9,500 వరకు ఉంది. సులభంగా వినియోగించే వీలున్న ఫీచర్లతో వీటిని రూపొందించినట్టు స్పైస్ డివైసెస్ సీఈవో సుధీర్ కుమార్ తెలిపారు.
చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ ట్రాన్సన్ హోల్డింగ్స్, భారత్‌కు చెందిన స్పైస్ మొబిలిటీ ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. టెక్నో, ఐటెల్, ఇన్ఫినిక్స్ బ్రాండ్లతో 58 దేశాల్లో మొబిలిటీ ఉత్పత్తులను ట్రాన్సన్ గ్రూప్ విక్రయిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్లలో మొబైల్స్‌ను తయారు చేస్తారు. అమ్మకాలు నిర్దేశిత స్థాయికి చేరిన తర్వాత సొంతంగా ప్లాంటును నెలకొల్పుతామని స్పైస్ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దిలీప్ మోది వెల్లడించారు.