spice
-
వేసవిలో ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉంటే మేలు!
సమ్మర్లో ఏదీ పడేతే అది తినకూడదు. సూర్యుడి భగ భగలకి దాహం దాహం అన్నట్లు ఉంటుంది. ఎక్కువ ఆహారం తినలేం. చల్లటి పానీయాలే తీసుకోవాలని పిస్తుంది. అలా అని కూల్‌డ్రింక్స్ వంటివి తాగితే ఇక అంతే సంగతులు. చేజేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నవారవ్వుతారు. ఇలాంటి హాట్ సమ్మర్లో ఎలాంటి పదార్థాలు తింటే మంచిది, వేటికి దూరంగా ఉంటే బెటర్ తెలుసుకుందామా!. వేసవి అనగానే వాతావరణం ఉక్కపోతలతో చిరాకు తెప్పిస్తుంటుంది. దీంతో చాలా మంది చల్లదనం కోసం తహతహలాడుతుంటారు. ఈ సమయంలో ఎక్కువగా దాహం వేస్తుంది. అయితే కొందరు కారం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతమైన దాహం వేస్తుంది. దీంతో ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల డైజేషన్ సమస్యలు వస్తాయి. కుడుపు ఉబ్బరంగా ఉండి అలసట ఏర్పడుతుంది. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగా స్పైస్ ఫుడ్‌ను అవైడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు అవితీసుకోకుండా ఉండటమే మంచిది. వేసవి కాలంలో శరీరం ఎక్కువగా డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి చల్లదనం చేసే ద్రవపదార్థాలు తీసుకోవాలి. అంటే టీ, కాఫీలు తగ్గించాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరం తేమ కోల్పోయిన నిర్జీవంగా తయారై అనారోగ్యం ఏర్పడవచ్చు. మాంసాహారం అనగానే చాలా మంది లొట్టలేసుకొని తింటారు. వేసవిలో ఇవి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇవి జీర్ణక్రియను మందగించడమే కాకుండా ఒక్కోసారి కడుపులో సమస్యలు వచ్చి విరేచనాలు రావొచ్చు. అలాగే వేపుళ్లు, పచ్చళ్లను సైతం ఈ కాలంలో అవైడ్ చేయాలి. వీటికి బదులు పెరుగన్నం, తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. లేకపోతే అనేక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో ఫ్రైడ్‌ఫుడ్స్, జంక్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. అసలే ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుందంటే.. ఇక వీటిని తింటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. చాలామంది ఎండలోంచి ఇంటికి రాగానే.. లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఎండ వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్.. వంటివి తీసుకుంటుంటారు. అయితే ఇవి వేసవి వేడి నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ శరీరంలో అత్యధికంగా వేడి ఉత్పత్తయ్యేలా చేస్తాయి. (చదవండి: ఏసీ నీటిని ఉపయోగించొచ్చా! ఆరోగ్యానికి మంచిదేనా?) -
స్పైసీ చిప్స్ తినకూడదా? చనిపోతారా..?
చిన్నారుల దగ్గర నుంచి పెద్దలు వరకు సరదాగా కాలక్షేపంగా తినే చిరుతిండ్లలో చిప్స్ ఒకటి. అవంటే.. అందరూ ఇష్టంగా లాగించేస్తారు. అవి తినొద్దు! లివర్‌కి మంచిది కాదన్నా.. పిల్లలే కాదు పెద్దలు కూడా చిన్నపిల్లల్లా..ఒక్కసారి తింటే ఏం కాదులే అంటూ లాగించేస్తారు. అంతలా ప్రజలు ఈ చిప్స్‌ని ఇష్టంగా తింటుంటారు. ఇటీవల నెట్టింట రకరకాల ఛాలెంజ్‌లను చూస్తున్నాం. సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ ఛాలెంజ్‌లను చేసేందుకు తెగ ఉత్సాహం కనబరుస్తున్నారు కూడా. అవి మంచివి అయితే పర్లేదు. ప్రాణాంతకమైనవి అయితేనే సమస్య. ఇక్కడొక చిన్నారి కూడా అలాంటి ఛాలెంజ్‌ని తీసుకుని ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. ఆ చిన్నారి ఆ ఛాలెంజ్‌ని తీసుకున్నాక గానీ తెలియలేదు స్పైసీ చిప్స్ తింటే చనిపోతారని. వాట్? ఇది నిజమా? అని షాకవ్వకుండా. ఈ ఘటన యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే..మాసాచుసెట్స్‌కి చెందిన హారస్ వోలోబా అనే 14 ఏళ్ల బాలుడు ఆన్లైన్ చక్కర్లు కొడుతున్న స్పైసీ చిప్స్ ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. అది తిన్న కొద్దిగంటలకే తీవ్రమైన కడుపునొప్పితో గిలగిలలాడిపోయాడు. హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా.. ఫలితం శూన్యమే అయ్యింది. ఆస్పత్రికి వెళ్లాక ఆ బాలుడి పరిస్థతి మరింతగా విషమించి మృతి చెందాడు. అతను తీసుకున్న స్పైసీ ఫుడ్ ఛాలెంజ్‌లో తినాల్సిన చిప్స్ ప్రపంచంలోనే అత్యంత స్పైసీ చిప్స్ అట. దాని ప్యాకింగ్ కవర్‌పై కూడా అత్యంత ఘాటైనా మిరియాలతో చేసినవని గర్భిణీ స్త్రీలు, ఇతర సమస్యలున్న పెద్దలు వీటికి దూరంగా ఉండాలని ఓ హెచ్చరికి కూడా ఉంటుందట. ఐతే ఆ బాలుడి కుటుంబ సభ్యులు మాత్రం ఈ చిప్స్ తిన్నాక మా అబ్బాయి అస్వస్థతకు గురై చనిపోయాడంటూ గొడవచేశారు. ఆ చిప్స్‌ని బ్యాన్ చేయాలని గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చారు కూడా. ఈ స్పైసీ చిప్స్‌కి సంబంధించి తొలి ప్రాణాంతక కేసు కూడా ఇదే. ఈ ఘటనతో అక్కడ కొన్ని పాఠశాల వద్ద ఈ చిప్స్ అమ్మకాలను బ్యాన్ చేశారు కూడా. ఈ స్పైసీ చిప్స్ ప్యాకెట్ కేవలం రూ.830/లకే మార్కెట్లో దొరుకుతుంది. తాము ఇచ్చిన హెచ్చరికను పట్టించకుండా తినడం వల్లే ఇలా జరిగిందని ఆ ప్యాకెట్లు ఉత్పత్తి చేసే కంపెనీ వాదించడం గమనార్హం. ఇక అధ్యయనాల్లో కూడా అందులో వాడే ఘాటూ మిరియాల పొడి తీవ్రమైన గుండె సంబంధిత రుగ్మతలకు దారితీసే అవకాశం ఉందని తేలింది. ఇక ఆ బాలుడు చిప్స్ వల్లే చనిపోయాడన్నది అధికారికంగా నిర్థారణ కాలేదు. పోస్ట్‌మార్టం తదనంతరం వాస్తవాలు తెలియాల్సి ఉంది. ఏదీఏమైనా ఇలాంటి జంక్ ఫుడ్స్ పిల్లలకు ఇచ్చేటప్పుడూ కాస్త పెద్దలు ఆలోచించటం మంచిది. ఇంట్లో తయారు చేసి ఇవ్వండి గానీ మార్కెట్లో దొరికే చిప్స్ జోలికి వెళ్లకపోతేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..) -
స్పైస్ మొబైల్ లాంచ్, ధర, ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: స్పైస్ బ్రాండ్ సరికొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. చైనాకు చెందిన ట్రాన్సిషన్ హోల్డింగ్స్, దేశీయ కంపెనీ స్పైస్ మొబిలిటీ జాయింట్ వెంచర్ కంపెనీ బుధవారం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎఫ్311 పేరుతో ఇండియన్ మార్కెట్లో దీన్ని విడుదల చేసింది. దీని ధరను రూ .5,599 గా నిర్ణయించింది. ఫుల్‌వ్యూ డిస్ప్లే, రియర్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్‌సెన్సర్ ప్రత్యక ఆకర్షణ. అంతేకాదు ఒక ఏడాది రీప్లేస్మెంట్ వారంటీ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఎఫ్311 ఫీచర్లు 5.45-అంగుళాల స్క్రీన్, 18: 9 కారక నిష్పత్తి ఆండ్రాయిడ్ ఓరియో 8.1 480x960 రిజల్యూషన్ 1జీబీర్యామ్, 16జీబీ స్టెరేజ్ 32 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 5ఎంపీ సెల్ఫీ కెమెరా 5ఎంపీ రియర్ కెమెరా 2400 ఎంఏహెచ్ బ్యాటరీ -
మార్కెట్లోకి మళ్లీ స్పైస్ మొబైల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ స్పైస్ భారత మార్కెట్లో రీ–ఎంట్రీ ఇచ్చింది. 8 కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటిలో మూడు స్మార్ట్ఫోన్లు కాగా మిగిలినవి ఫీచర్ ఫోన్లు. మొబైల్స్‌పై ఏడాదిపాటు రీప్లేస్మెంట్ వారంటీ ఆఫర్ చేస్తోంది. ధరల శ్రేణి రూ.1,180 నుంచి రూ.9,500 వరకు ఉంది. సులభంగా వినియోగించే వీలున్న ఫీచర్లతో వీటిని రూపొందించినట్టు స్పైస్ డివైసెస్ సీఈవో సుధీర్ కుమార్ తెలిపారు. చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ ట్రాన్సన్ హోల్డింగ్స్, భారత్‌కు చెందిన స్పైస్ మొబిలిటీ ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. టెక్నో, ఐటెల్, ఇన్ఫినిక్స్ బ్రాండ్లతో 58 దేశాల్లో మొబిలిటీ ఉత్పత్తులను ట్రాన్సన్ గ్రూప్ విక్రయిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్లలో మొబైల్స్‌ను తయారు చేస్తారు. అమ్మకాలు నిర్దేశిత స్థాయికి చేరిన తర్వాత సొంతంగా ప్లాంటును నెలకొల్పుతామని స్పైస్ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దిలీప్ మోది వెల్లడించారు. -
తల్లిబాంబుకి తాత మన దగ్గరుంది!
రేడియేషన్ విడుదల చేయని అతి శక్తిమంతమైన మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్(ఎంఓఏబీ) ఆప్ఘనిస్తాన్‌లోని ఐసిస్ స్ధావరంపై ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఈ బాంబుకు మరో పేరు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. అమెరికా బాంబు దాడిలో దాదాపు 100 మంది తీవ్రవాదులు హతం కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో వార్తల్లోకి ఎంటరై తమ వద్ద ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఉందంటూ రష్యా పేర్కొంది. అయితే, అసలు రేడియేషన్ కలిగించని శక్తిమంతమైన బాంబు ఎవరి దగ్గర ఉంది?. మన దగ్గర. అవును భారత్ వద్ద రేడియేషన్ కలిగించని శక్తిమంతమైన బాంబు ఉంది. దీనిని మన డీఆర్డీవో ఆరేళ్ల క్రితమే అభివృద్ధి చేసింది. దాని పేరు సీఎల్-20. సంప్రదాయ పేలుడు పదార్ధాల కంటే 15 రెట్లు ఇది శక్తిమంతమైనది. అయితే, దీనిని ఎలా ప్రయోగిస్తారు అనే విషయం మాత్రం సీక్రెట్. ఇండియా వద్ద గల మరో బాంబు పేరు స్మార్ట్ ప్రిసైజ్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టీవ్(ఎస్పీఐసీఈ). సింపుల్‌గా స్పైస్. దీనిని కార్గో విమానాల నుంచి ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఇండియా వద్ద గల మిరేజ్ 2000, సుఖోయ్ జెట్ల నుంచి సులువుగా మోసుకెళ్లొచ్చన్నమాట. ఉగ్ర స్ధావరాల నేల మట్టం చేయాలనుకున్న సమయంలో దీన్ని భారత్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. స్పైస్‌ను అభివృద్ధి చేసింది ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్పైస్ బరువు కేవలం 1000 కేజీలు. సర్జికల్ స్ట్రైక్స్ లాంటి వాటిని ఎయిర్‌ఫోర్స్ ద్వారా నిర్వహించాలనుకుంటే మొదటి చాయిస్ స్పైసే. -
ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన హెచ్డీఎఫ్సీ రూపీ బాండ్స్
లండన్/న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ రూ.3,000 కోట్ల రూపీ(మసాలా) బాండ్ ఇష్యూ 4.3 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. రూపీ బాండ్ల ద్వారా రూ.2,000 కోట్లు, రూ. 1,000 కోట్లు గ్రీన్ షూ ఆప్షన్‌గా.. మొత్తం రూ.3,000 కోట్ల సమీకరించాలని హెచ్డీఎఫ్సీ భావించింది. ఈ 3,000 కోట్ల రూపీ బాండ్లకు 48 ఖాతాల ద్వారా రూ.8,673 కోట్లకు బిడ్లు వచ్చాయి. ఈ బాండ్లకు సెమీ-యాన్యువల్ కూపన్ రేటు 7.875 శాతమని, వీటి కాలపరిమితి మూడు సంవత్సరాల 1నెల అని హెచ్డీఎఫ్సీ తెలిపింది. మొత్తం మీద ఇన్వెస్టర్లకు ఏడాదికి 8.33 శాతం రాబడి వస్తుందని తెలిపింది. విదేశాల్లో రూపాయి బాండ్ల ద్వారా నిధులు సమీకరించిన తొలి భారత కంపెనీగా హెచ్డీఎఫ్సీ నిలిచింది. -
మసాలాల మాటున మాదక ద్రవ్యాలు!
అబుధబిః మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును అబుధబి పోలీసులు రట్టు చేశారు. మసాలా దినుసుల మాటున మాదకద్రవ్యాలను ఎగుమతి చేస్తున్న ముగ్గురు మహిళలతో సహా 8 మంది నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. మసాలాల పేరుతో మాదక ద్రవ్యాలు కలిగిన 398 సంచులను వారివద్దనుంచీ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన మొత్తం ఎనిమిది సభ్యులతో కూడిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను అబుధబి పోలీసులు పట్టుకున్నారు. మసాలా దినుసులు, సంప్రదాయ ఔషధాల పేరున ముఠా... మాదక ద్రవ్యాల రవాణా జరుపుతున్నట్లు సిఐడీ డైరెక్టర్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ తెలిపారు. ముఠాలోని సభ్యులంతా ఇంచుమించుగా 21-28 సంవత్సరాల మధ్య వయస్కులేనన్న పోలీసులు, సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలు వారి అధీనంలో ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై అక్రమ రవాణా, మత్తు పదార్థాల విక్రయం తదితర కేసులను నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో అరబ్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు, ముగ్గురు యూరోపియన్లు, వివిధ దేశాలకు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
మహారుచి
కృష్ణ, గోదావరి, నర్మద, తపతి.. ‘మహా’నదులు. ముంబై, పుణె, నాగపూర్ .. ‘మహా’నగరులు. చాళుక్య, శాతవాహన, మరాఠీ.. ‘మహా’వంశాలు. పావ్‌బాజీ, మసాలాబాత్, రసీలా బూందీ.. ‘మహా’మీల్స్ నదుల్లో మునిగితే పుణ్యం. నగరాల్లో తిరిగితే జ్ఞానం. వంశాలు తిరగేస్తే చరిత్ర సారం. మీల్స్ ఆరగిస్తే మహారుచి! మహాద్భాగ్యం!! ఈవారం మీకోసం మహారాష ్టస్ప్రెషల్స్!! మసాలా టాక్ కావల్సినవి: పెరుగు - కప్పుడు; నీళ్లు - 2 కప్పులు; మసాలా (లవంగ,, దాల్చిన చెక్క, ఇలాచీ వేయించిన పొడి) - చిటికెడు, ఉప్పు - చిటికెడు; కొత్తిమీర తరుగు - అర టీ స్పూన్; వెల్లుల్లి - 1 తయారీ: పెరుగును బాగా చిలికి, కొత్తిమీర, వెల్లుల్లి, నీళ్లు కలిపి బ్లెండ్ చేయాలి. ఉప్పు, మసాలా కలిపి సర్వ్ చేయాలి. కడాయిలో అర టీ స్పూన్ నూనె వేసి, పోపు గింజలు వేసి కూడా మజ్జిగలో కలుపుకోవచ్చు. పావ్ భాజీ పావ్‌కి కావల్సినవి: లడి పావ్స్ - 4; నెయ్యి - 2 టేబుల్ స్పూన్; పావ్ భాజీ మసాలా - తగినంత (మసాలా తయారీ పక్కన ఇచ్చాం) భాజికి కావల్సినవి: బంగాళదుంప - 1 (ఉడికించి గుజ్జు చేయాలి); క్యాలీఫ్లవర్ తరుగు - అర కప్పు; పచ్చిబఠాణీ - పావు కప్పు; క్యారట్ తరుగు - పావు కప్పు; క్యాబేజీ తరుగు - అరకప్పు; క్యాప్సికమ్ తరు గు - పావు కప్పు; టొమాటో తరుగు - 1 1/2 కప్పు; కారం - అర టీ స్పూన్; పావ్ భాజీ మసాలా - టీ స్పూన్; నల్లుప్పు - అర టీ స్పూన్; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి - 2; వెల్లుల్లి రెబ్బలు - 4, బటర్- చిన్నముక్క సర్వ్ చే సేటప్పుడు... ఉల్లిపాయ - 1; నిమ్మముక్కలు - 2; కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారట్, బఠాణీలను ఉడికించి, నీళ్లను వడకట్టి ముక్కలను పేస్ట్ చేసుకోవాలి కడాయిలో నెయ్యి వేసి, వేడయ్యాక ఉల్లిపాయ తరుగు, క్యాప్సికమ్ వేసి వేయించి కారం, అల్లం పేస్ట్ వేసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి దీంట్లో టొమాటో తరుగు వేసి ఉడికించాలి పసుపు, కారం, పావ్ భాజీ మసాలా, నల్లుప్పు, ఉప్పు, కూరగాయల మిశ్రమం, బంగాళదుంప గుజ్జు, అరకప్పు నీళ్లు వేసి మిశ్రమం మెత్తబడే వరకు ఉడికించాలి పావ్లకు కొద్దిగా నెయ్యి రాసి, రెండు వైపులా పెనం మీద వేయించి, మసాలా చల్లి ప్లేట్లోకి తీసుకొవా లి. వాటి పక్కనే ఉల్లిపాయ తరుగు ఉంచాలి. భాజీ ఉడికాక ప్లేట్లోకి తీసుకొని, పైన బటర్ వేసి, కొత్తిమీర చల్లి, నిమ్మముక్కలతో సర్వ్ చేయాలి. మసాలా బాత్ కావల్సినవి: బియ్యం - కప్పు (15 నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి); నూనె - టేబుల్ స్పూన్; జీలకర్ర - అర టీ స్పూన్; ఉల్లిపాయ తరుగు - అర కప్పు; ఇంగువ - చిటికెడు; అల్లం తరుగు - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 2 (తరగాలి); పచ్చి బఠాణీ, మొక్కజొన్నగింజలు - పావు కప్పు; ఉప్పు - తగినంత; పసుపు - అర టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్మసాలా పొడికి... జీలకర్ర - అర టీ స్పూన్; ధనియాలు - అర టీ స్పూన్; లవంగాలు - 3; నల్లమిరియాలు - 6 (మసాలా పొడికి కావల్సిన దినుసులన్నీ పెనం మీద వేయించుకొని, పొడి చేసి పక్కన ఉంచాలి) తయారీ: గిన్నె లేదా ప్రెజర్ కుకర్‌లో నూనె వేసి, వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, ఇంగువ వేసి 2 నిమిషాలు వేయించాలి. అల్లం తరుగు, పచ్చిమిర్చి, వడకట్టిన బియ్యం, పచ్చి బఠానీ, మొక్కజొన్న గింజలు, క్యారెట్, బీన్స్ వేసి మరో 2 నిమిషాలు ఉంచి, కలపాలి. దీంట్లో రెండున్నర కప్పుల నీళ్లు, ఉప్పు, పసుపు, మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టాలి.అన్నం పూర్తిగా ఉడికాక చివరలో కొత్తిమీర వేసి దించాలి. మసాలా బాత్‌ని రైతా లేదా శనగల కూరతో వడ్డించాలి. నోట్: మసాలా బాత్‌లో దొండకాయలు, వంకాయ ముక్కలు, చిక్కుడు గింజలు కూడా వేసుకోవచ్చు. రసీలా బూందీ కావల్సినవి శనగపిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; నూనె - వేయించడానికి తగినంత; రోజ్‌వాటర్ - పావు టీ స్పూన్ తయారీ: బూందీ తయారీకి శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి కడాయిపైన బూందీ జల్లి పెట్టి, దానిపైన శనగపిండి మిశ్రమం పోసి మృదువుగా రుద్దుతూ ఉండాలి. జల్లి నుంచి పిండి జారి, నూనెలో పడుతుంది. బూందీని వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి పంచదారలో 2 కప్పుల నీళ్లు పోసి, పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. గులాబ్‌జామూన్ కోసం ఎలా పంచదార పాకం చేసుకుంటామో అలాగే దీనిని తయారు చేసుకోవాలి. ఈ పంచదార పాకంలో రోజ్ వాటర్ కలపాలి. పంచదార పాకంలో వేయించిన బూందీ వేసి కలిపి, భోజనానంతరం వడ్డించాలి. పిత్లా కావల్సినవి: శనగపిండి - కప్పు; నూనె - 3 టీ స్పూన్లు; నీళ్లు - 4 కప్పులు;; పచ్చిమిర్చి - 6 ; వెల్లుల్లి - 4 ; ఉల్లిపాయ - 1 (తరగాలి); ఆవాలు - టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్; ఉప్పు - రుచికి తగినంత; కొత్తిమీర - టీ స్పూన్ తయారీ: చిన్న గిన్నెలో శనగపిండి వేసి, అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టౌ మీద గిన్నె పెట్టి వేడయ్యాక నూనె వేసి, అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి పసుపు, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి దీంట్లో జారుగా కలిపిన శనగపిండి వేసి,4 కప్పుల నీళ్లు పోసి కలుపుతూ మిశ్రమం బాగా చిక్కబడేంతవరకు ఉడకనివ్వాలి చివరగా ఉప్పు కలిపి, కొత్తిమీర వేసి దించాలి. దీనిని చపాతీ, రైస్‌లోకి వడ్డించాలి. పావ్ భాజీ మసాలా... ఎండుమిర్చి - 6, ధనియాలు - 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు, నల్లమిరియాలు - అర టీ స్పూన్, దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క, లవంగాలు - 3, ఇలాచీలు - 4, సోంపు - టీ స్పూన్ తయారీ: కడాయిలో ఈ దినుసులన్నీ వేసి సన్నని మంటమీద వేయించుకోవాలి. చల్లారాక అన్నీ కలిపి పొడి చేసుకోవాలి. మహారాష్ర్ట వంటకాలు కొంత ఘాటుగా ఉంటాయి. గోధుమ, బియ్యం, జొన్నలు, సజ్జలు, పప్పులు, కూరగాయలు వీళ్ల వంటకాలలో ప్రధానంగా చూస్తాం. అలాగే పల్లీలు, జీడిపప్పులు కూడా వీరి వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. సంప్రదాయ వంటకాలతో పాటు వీరి రుచులలో దేశంలోని ఇతర ప్రాంతాల ఘుమఘుమలు త్వరగా చేరిపోతాయి. వీరి వంటలలో మాంసాహారం చాలా చాలా తక్కువ. మహారాష్ట్రీయుల పైన ప్రముఖ నగరాలైన ముంబయ్, పునే పట్టణవాసుల ఆహారపు అలవాట్ల ప్రభావం ఎక్కువ. ఉడిపి రుచులు ముఖ్యంగా ఇడ్లీ, దోసెలే కాకుండా చైనీస్ వంటకాలూ వీరి ఆహారంలో భాగమయ్యాయి. అయితే మోదక్, పత్ల, పావ్ భాజీ.. వంటివి మాత్రం తమ ప్రాభవాన్ని కోల్పోలేదు. కొల్హాపురి మటన్ కావల్సినవి: మటన్ - అర కేజీ మటన్‌ని నానబెట్టడానికి... అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ ; స్పూన్లు; నూనె - టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్; ఉప్పు - టీ స్పూన్ కొల్హాపురి మసాలా.. (పెద్ద ఉల్లిపాయలు -2, ఎండు కొబ్బరి తురుము - అర కప్పు, నూనె - టేబుల్ స్పూన్, ధనియాలు - టీ స్పూన్, నువ్వులు - ఒకటిన్నర టీ స్పూన్, గసగసాలు - 3 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 8, లవంగాలు - 2); ఉల్లిపాయలు - 2 (తరగాలి); నూనె - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; కొత్తిమీర తరుగు - టీ స్పూన్; నీళ్లు - తగినన్ని తయారీ:మటన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, నూనె బాగా కలిపి గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. కడాయిలో నూనె వేసి మసాలాకు ఇచ్చిన దినుసులన్నీ వేసి వేయించుకోవాలి. చివరగా కొబ్బరి వేసి మరో 2 నిమిషాలు వేయించి, మంట తీసేయాలి. చల్లారాక వీటన్నింటినీ కలిపి పేస్ట్ చేయాలి. కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నూనె వేసి ఉల్లిపాయలు వేయించాలి. దీంట్లో బాగా నానిన మటన్ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కలపాలి. ముప్పావు భాగం మటన్ ఉడికాక దాంట్లో మసాలా మిశ్రమం వేసి, నూనె తేలేంతవరకు ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. పూర్తిగా ముక్క ఉడికేదాకా మంట తగ్గించి ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసి, వేడి వేడిగా భోజనంలోకి వడ్డించాలి. కరె్టిసీ సంజయ్ కుమార్ షెఫ్ విలేజ్ సోల్ ఆఫ్ ఇండియా బేగంపేట్, హైదరాబాద్ -
భారత్‌లోనే చౌకగా స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల దిగుమతి రానురాను తగ్గిపోతోంది. భారత్‌లోనే చౌకగా స్మార్ట్ఫోన్లు దొరుకుతున్నాయి. పలు కంపెనీలు ఇక్కడే తక్కువ ధరలకు స్మార్ట్ఫోన్లు పోటీపడి తయారు చేస్తున్నాయి. ఆ ప్రభావం దిగుమతులపై పడింది. ఫైర్ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ ఈ నెల 29న భారత్‌లో లాంఛ్ కానుంది. ఇంటెక్స్, స్పైస్ సంస్థలు ఫైర్ఫాక్స్ ఫోన్‌ను విడుదల చేయనున్నాయి. ఫైర్ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ ధర 2,229 రూపాయలు. -
స్పైస్ నుంచి డ్యూయల్ సిమ్ స్మార్ట్‌వాచ్
న్యూఢిల్లీ: స్పైస్ రిటైల్ కంపెనీ డ్యూయల్ సిమ్‌లను సపోర్ట్ చేసే స్మార్ట్‌వాచ్, స్మార్ట్ పల్స్ ఎం 9010ను మంగళవారం ఆవిష్కరించింది. ఈ నెల 11 (శుక్రవారం) నుంచి హోమ్షాప్ 18 ద్వారా అందించనున్న ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ.3,999. ఈ స్మార్ట్‌వాచ్‌లో 4 సెం.మీ, టచ్‌స్క్రీన్ ఉంటుందని స్పైస్ రిటైల్ సీఈవో (డివెసైస్) టి. ఎం. రామకృష్ణన్ పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌వాచ్‌తో ఉచితంగా అందించే బ్లూటూత్ హెడ్సెట్ ద్వారా కాల్స్ చేయవచ్చని, రిసీవ్ చేసుకోవచ్చని వివరించారు. ఎస్ఎంఎస్లను చదవడమే కాకుండా పంపించవచ్చని కూడా పేర్కొన్నారు. అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేయవచ్చని వివరించారు. ఎఫ్ఎం రేడియో, వీడియో ప్లేయర్, వీజీఏ కెమెరా, 8 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 420 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కైనా సెకండరీ డివైస్‌గా పనిచేస్తుందని తెలిపారు. భారత మార్కెట్లో సిమ్‌తో కూడిన ధరించే వస్తువును అందించిన తొలి దేశీయ కంపెనీ తమదేనని, మరిన్ని వినూత్నమైన ఉత్పత్తులను అందించనున్నామని రామకృష్ణన్ పేర్కొన్నారు.