స్పైస్ నుంచి డ్యూయల్ సిమ్ స్మార్ట్‌వాచ్ | Spice Smart Pulse Smartwatch With Voice Calling Launched at Rs. 3,999 | Sakshi
Sakshi News home page

స్పైస్ నుంచి డ్యూయల్ సిమ్ స్మార్ట్‌వాచ్

Published Wed, Jul 9 2014 12:48 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

స్పైస్ నుంచి  డ్యూయల్ సిమ్ స్మార్ట్‌వాచ్ - Sakshi

స్పైస్ నుంచి డ్యూయల్ సిమ్ స్మార్ట్‌వాచ్

న్యూఢిల్లీ: స్పైస్ రిటైల్ కంపెనీ డ్యూయల్ సిమ్‌లను సపోర్ట్ చేసే స్మార్ట్‌వాచ్, స్మార్ట్ పల్స్ ఎం 9010ను మంగళవారం ఆవిష్కరించింది. ఈ నెల 11 (శుక్రవారం) నుంచి హోమ్‌షాప్ 18 ద్వారా అందించనున్న ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ.3,999.  ఈ స్మార్ట్‌వాచ్‌లో 4 సెం.మీ, టచ్‌స్క్రీన్ ఉంటుందని స్పైస్ రిటైల్ సీఈవో (డివెసైస్) టి. ఎం. రామకృష్ణన్ పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌వాచ్‌తో ఉచితంగా అందించే బ్లూటూత్ హెడ్‌సెట్ ద్వారా కాల్స్ చేయవచ్చని, రిసీవ్ చేసుకోవచ్చని వివరించారు.

ఎస్‌ఎంఎస్‌లను చదవడమే కాకుండా పంపించవచ్చని కూడా పేర్కొన్నారు. అలాగే ఇంటర్‌నెట్ బ్రౌజింగ్ కూడా చేయవచ్చని వివరించారు. ఎఫ్‌ఎం రేడియో, వీడియో ప్లేయర్, వీజీఏ కెమెరా, 8 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 420 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కైనా సెకండరీ డివైస్‌గా పనిచేస్తుందని తెలిపారు. భారత మార్కెట్లో సిమ్‌తో కూడిన ధరించే వస్తువును అందించిన తొలి దేశీయ కంపెనీ తమదేనని, మరిన్ని వినూత్నమైన ఉత్పత్తులను అందించనున్నామని రామకృష్ణన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement