ఓవర్ సబ్స్క్రైబ్ అయిన హెచ్డీఎఫ్సీ రూపీ బాండ్స్
లండన్/న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ రూ.3,000 కోట్ల రూపీ(మసాలా) బాండ్ ఇష్యూ 4.3 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. రూపీ బాండ్ల ద్వారా రూ.2,000 కోట్లు, రూ. 1,000 కోట్లు గ్రీన్ షూ ఆప్షన్‌గా.. మొత్తం రూ.3,000 కోట్ల సమీకరించాలని హెచ్‌డీఎఫ్‌సీ భావించింది. ఈ 3,000 కోట్ల రూపీ బాండ్లకు 48 ఖాతాల ద్వారా రూ.8,673 కోట్లకు బిడ్‌లు వచ్చాయి. ఈ బాండ్లకు సెమీ-యాన్యువల్ కూపన్ రేటు 7.875 శాతమని, వీటి కాలపరిమితి మూడు సంవత్సరాల 1నెల అని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం మీద ఇన్వెస్టర్లకు ఏడాదికి 8.33 శాతం రాబడి వస్తుందని తెలిపింది. విదేశాల్లో రూపాయి బాండ్ల ద్వారా నిధులు సమీకరించిన తొలి భారత కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది.