Bond Issue
-
ఫారెక్స్ నిల్వలు ఎందుకంటే..
భారత విదేశీ మారక నిల్వలు మొదటిసారి రికార్డుస్థాయిలో 700 బిలియన్ డాలర్ల మార్కును చేరాయి. ఇటీవల ప్రభుత్వ వర్గాలు అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 సెప్టెంబర్ 27 నాటికి దేశంలోని విదేశీ మారక నిల్వలు 705 బిలియన్ డాలర్ల(రూ.59 లక్షల కోట్లు)కు చేరాయి. ఫారెక్స్ నిర్వల వల్ల దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం. దేశీయ స్టాక్ మార్కెట్లు పెరిగేందుకు ఫారెక్స్ నిల్వలు ఉపయోగపడుతాయి.రూపాయి విలువను స్థిరీకరించడానికి ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలను ఉపయోగిస్తుంది. కరెన్సీలో తీవ్రమైన హెచ్చుతగ్గులను నిరోధించడానికి తోడ్పడుతాయి.విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం ద్వారా రూపాయి విలువను ఆర్బీఐ నియంత్రిస్తుంది.వస్తువుల దిగుమతుల కోసం ఫారెక్స్ నిల్వలు ఉపయోగపడుతాయి.చమురు ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ నిల్వలు తోడ్పడుతాయి.ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై దర్యాప్తు వాయిదా!ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ వాతావరణం, ప్రపంచ ఉద్రిక్తతలు వెరసి చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న దేశం మనది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయాలంటే ఫారెక్స్ నిల్వలు ఎంతో ఉపయోగపడుతాయి. రానున్న రోజుల్లో భారత్ ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుందని నమ్మి వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు వివిధ రూపాల్లో పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఫారెక్స్ నిల్వలు పెరుగుతున్నాయి. -
బాండ్ల జారీలో తగ్గిన కార్పొరేట్ స్పీడ్
న్యూఢిల్లీ: బాండ్ల జారీ ద్వారా మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు కేవలం రూ.5.88 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. గడచిన ఆరు సంవత్సరాల్లో ఈ మార్గంలో నిధుల సమీకరణ ఇంత తక్కువ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి. 2020–21లో ఈ విధానం ద్వారా కార్పొరేట్లు రూ.7.72 లక్షల కోట్ల నిధుల సమీకరించాయి. అంటే వార్షికంగా చూస్తే 24 శాతం తగ్గాయన్నమాట. ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరును కనబరచడం, బ్యాంకింగ్ తక్కువ వడ్డీరేట్ల విధానం వంటి అంశాల నేపథ్యంలో ఈ సాధనాల ద్వారానే నిధుల సమీకరణకు కార్పొరేట్లు మొగ్గు చూపినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి. వడ్డీరేట్ల పెరుగుదల, ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మూలధన అవసరాలు పెరగడం వంటి పరిస్థితుల్లోనే తిరిగి కార్పొరేట్ల ప్రైవేట్ ప్లేస్మెంట్ల వైపు దృష్టి సారించవని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ మళ్లీ డిఫాల్ట్ -
25 నుంచి తాజా సావరిన్ గోల్డ్ బాండ్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ తాజా ఇష్యూ ఈ నెల 25వ తేదీ నుంచి (సోమవారం) ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు అంటే అక్టోబర్ 29వ తేదీ వరకూ ఇష్యూ అందుబాటులో ఉంటుంది. నవంబర్ 2న బాండ్ జారీ అవుతుంది. ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాండ్ జారీ చేస్తుంది. 2021–22 సిరిస్‌లో ఇది ఏడవ విడత గోల్డ్‌బాండ్ స్కీమ్. చందా కాలానికి ముందు మూడు పనిదినాల్లో 999 ప్యూరిటీకి సంబంధించి ఇండియన్ బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ పబ్లిష్ చేసిన సగటు ముగింపు ధరను ప్రాతిపదికగా తీసుకుని గోల్డ్ బాండ్ ధర నిర్ణయం అవుతుంది. అంటే అక్టోబర్ 20,21,22 తేదీల్లో పబ్లిష్ అయిన సగటు ముగింపు ధర బాండ్ ధరగా ఉంటుందన్నమాట. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారికి బాండ్ ధరపై గ్రాముకు రూ.50 రిబేట్ కూడా లభిస్తుంది. 2021 మే నుంచి బాండ్ల జారీ 2021–22 సిరిస్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం 10 విడతల బాండ్ల జారీ జరుగుతుండగా, 2021 సెప్టెంబర్ వరకూ ఆరు విడతలు పూర్తయ్యింది. అక్టోబర్ 25న జారీ అవుతున్న బాండ్‌తో కలుపుకుని 2022 మార్చి లోపు మరో నాలుగు విడతల్లో బాండ్ల జారీ జరగాల్సి ఉంది. నిర్ధారిత బ్యాంకులు, పోస్టాఫీసులు, బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లీనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా బాండ్లను పొందవచ్చు. -
గోల్డ్ బాండ్ జారీ ధర రూ.5,051
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ జారీ ధరను ఆర్బీఐ నిర్ణయించింది. ఈ బాండ్ జారీ ధరను రూ. 5,051(ఒక గ్రాముకు)గా ఖరారు చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020–21 సిరీస్ –7 ఈ నెల 12న మొదలై 16న ముగుస్తుంది. 1 గ్రాము, 1గ్రాము గుణిజాల డినామినేషన్లలో ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ గోల్డ్బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ఈ బాండ్లను విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ బాండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసేవారికి, అలాగే బాండ్ల సొమ్ములను డిజిటల్ విధానంలో చెల్లించేవారికి రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. కాగా ఆరో సిరీస్ గోల్డ్ బాండ్ల జారీ ధర రూ.5,117గా ఉంది. నివాసిత వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబం, ట్రస్ట్‌లు, యూనివర్శిటీలు,చారిటబుల్ ట్రస్ట్‌లను మాత్రమే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నారు. బ్యాంక్‌లు, కొన్ని అధీకృత పోస్ట్ ఆఫీసులు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ బాండ్లను విక్రయిస్తాయి. -
ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన హెచ్డీఎఫ్సీ రూపీ బాండ్స్
లండన్/న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ రూ.3,000 కోట్ల రూపీ(మసాలా) బాండ్ ఇష్యూ 4.3 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. రూపీ బాండ్ల ద్వారా రూ.2,000 కోట్లు, రూ. 1,000 కోట్లు గ్రీన్ షూ ఆప్షన్‌గా.. మొత్తం రూ.3,000 కోట్ల సమీకరించాలని హెచ్డీఎఫ్సీ భావించింది. ఈ 3,000 కోట్ల రూపీ బాండ్లకు 48 ఖాతాల ద్వారా రూ.8,673 కోట్లకు బిడ్లు వచ్చాయి. ఈ బాండ్లకు సెమీ-యాన్యువల్ కూపన్ రేటు 7.875 శాతమని, వీటి కాలపరిమితి మూడు సంవత్సరాల 1నెల అని హెచ్డీఎఫ్సీ తెలిపింది. మొత్తం మీద ఇన్వెస్టర్లకు ఏడాదికి 8.33 శాతం రాబడి వస్తుందని తెలిపింది. విదేశాల్లో రూపాయి బాండ్ల ద్వారా నిధులు సమీకరించిన తొలి భారత కంపెనీగా హెచ్డీఎఫ్సీ నిలిచింది.