భారత విదేశీ మారక నిల్వలు మొదటిసారి రికార్డుస్థాయిలో 700 బిలియన్ డాలర్ల మార్కును చేరాయి. ఇటీవల ప్రభుత్వ వర్గాలు అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 సెప్టెంబర్ 27 నాటికి దేశంలోని విదేశీ మారక నిల్వలు 705 బిలియన్ డాలర్ల(రూ.59 లక్షల కోట్లు)కు చేరాయి. ఫారెక్స్ నిర్వల వల్ల దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు పెరిగేందుకు ఫారెక్స్ నిల్వలు ఉపయోగపడుతాయి.
- రూపాయి విలువను స్థిరీకరించడానికి ఆర్‌బీఐ ఫారెక్స్ నిల్వలను ఉపయోగిస్తుంది. కరెన్సీలో తీవ్రమైన హెచ్చుతగ్గులను నిరోధించడానికి తోడ్పడుతాయి.
- విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం ద్వారా రూపాయి విలువను ఆర్‌బీఐ నియంత్రిస్తుంది.
- వస్తువుల దిగుమతుల కోసం ఫారెక్స్ నిల్వలు ఉపయోగపడుతాయి.
- చమురు ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ నిల్వలు తోడ్పడుతాయి.
ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై దర్యాప్తు వాయిదా!
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ వాతావరణం, ప్రపంచ ఉద్రిక్తతలు వెరసి చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న దేశం మనది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయాలంటే ఫారెక్స్ నిల్వలు ఎంతో ఉపయోగపడుతాయి. రానున్న రోజుల్లో భారత్ ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుందని నమ్మి వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు వివిధ రూపాల్లో పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఫారెక్స్ నిల్వలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment