Bond Market
-
ఫారెక్స్ నిల్వలు ఎందుకంటే..
భారత విదేశీ మారక నిల్వలు మొదటిసారి రికార్డుస్థాయిలో 700 బిలియన్ డాలర్ల మార్కును చేరాయి. ఇటీవల ప్రభుత్వ వర్గాలు అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 సెప్టెంబర్ 27 నాటికి దేశంలోని విదేశీ మారక నిల్వలు 705 బిలియన్ డాలర్ల(రూ.59 లక్షల కోట్లు)కు చేరాయి. ఫారెక్స్ నిర్వల వల్ల దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం. దేశీయ స్టాక్ మార్కెట్లు పెరిగేందుకు ఫారెక్స్ నిల్వలు ఉపయోగపడుతాయి.రూపాయి విలువను స్థిరీకరించడానికి ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలను ఉపయోగిస్తుంది. కరెన్సీలో తీవ్రమైన హెచ్చుతగ్గులను నిరోధించడానికి తోడ్పడుతాయి.విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం ద్వారా రూపాయి విలువను ఆర్బీఐ నియంత్రిస్తుంది.వస్తువుల దిగుమతుల కోసం ఫారెక్స్ నిల్వలు ఉపయోగపడుతాయి.చమురు ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ నిల్వలు తోడ్పడుతాయి.ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై దర్యాప్తు వాయిదా!ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ వాతావరణం, ప్రపంచ ఉద్రిక్తతలు వెరసి చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న దేశం మనది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయాలంటే ఫారెక్స్ నిల్వలు ఎంతో ఉపయోగపడుతాయి. రానున్న రోజుల్లో భారత్ ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుందని నమ్మి వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు వివిధ రూపాల్లో పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఫారెక్స్ నిల్వలు పెరుగుతున్నాయి. -
కష్టకాలం... కాపాడిన బాండ్ల వేలం
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి మూడు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా రూ. 12,500 కోట్లు సమకూర్చుకుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో 6 దఫాల్లో బాండ్లను వేలం వేసి ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని తెచ్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరపతి స్థిరంగా ఉండడం, పెట్టుబడిదారులకు భరోసా కలగడంతో రాష్ట్ర బాండ్లను కొనుగోలు చేయడం కోసం పోటాపోటీ బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం రావాల్సిన రూ.9 వేల కోట్ల కన్నా మరో రూ. 3,500 కోట్లు అదనంగా వచ్చాయని ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ మొత్తం నిధులను ఉద్యోగుల జీతాలు, ఆసరా పింఛన్ల చెల్లింపులకు ఉపయోగించామని, కొంత మొత్తం రైతు బంధు కింద ఖర్చు చేశామని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. కష్టకాలంలో... కలిసొచ్చింది వాస్తవానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిన కరోనా వైరస్ ప్రభావం మన రాష్ట్ర ఖజానా మీద కూడా భారీగానే పడింది. పన్ను రాబడుల ద్వారా వేల కోట్ల రూపాయల్లో రావాల్సిన ఆదాయం ఏప్రిల్, మే నెలల్లో వందల కోట్లలో కూడా రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ సాయం, పన్నుల పంపిణీ, జీఎస్టీ పరిహారం లాంటి వాటిపైనే ఆధారపడి ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా భారీగా కోత పడడంతో ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలకు నగదు సాయం, ఆరోగ్య కార్యక్రమాల ఖర్చులు, బియ్యం పంపిణీ లాంటి కార్యక్రమాలు ఖజానాకు అదనపు భారంగా మారాయి. వీటికి తోడు ఆసరా పింఛన్లు, ప్రభుత్వం ప్రతినెలా చేయాల్సిన అనివార్య చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున నిధులు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు నేతృత్వంలోని ఆర్థిక శాఖ బృందం ముందస్తు వ్యూహం, పక్కా క్రమశిక్షణతో ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా పకడ్బందీగా వ్యవహరించింది. ఈ పరిస్థితుల్లో బాండ్ల వేలం ద్వారా వచ్చిన రూ. 12,500 కోట్లు ఉపశమనం కలిగించాయి. ప్రతినెలా రూ. 4వేల కోట్లు కరోనా కష్టకాలంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నీ తమ బాండ్లను వేలానికి పెట్టాయి. ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం మన రాష్ట్రం కూడా ఈ మూడు నెలల్లో రూ.9 వేల కోట్ల విలువైన బాండ్లను వేలానికి పెట్టింది. కానీ, రాష్ట్ర ఆర్థిక పరపతికి అనుగుణంగా ఆర్బీఐ కూడా మరో రూ.3,500 కోట్ల విలువైన అదనపు బాండ్లను వేలం వేసేందుకు అంగీకరించి షెడ్యూల్లో చేర్చింది. దీంతో ఏప్రిల్ నెలలో రెండు దఫాల్లో రూ.4వేల కోట్లు, మేలో కూడా అదే తరహాలో రూ. 4వేల కోట్లు రాష్ట్రం సమకూర్చుకుంది. ఇక జూన్ 9న జరిగిన వేలంలో రూ. 2,461 కోట్లు, మంగళవారం మరో రూ. 2వేల కోట్లు వచ్చాయి. ఈ మొత్తం నిధులే కష్ట కాలంలో రాష్ట్ర ఆర్థిక బండిని గట్టెక్కించాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. -
బాండ్ ఫండ్స్‌లో మెరుగైన పనితీరు...
గత ఏడాది బాండ్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఈ ఏడాది మాత్రం బాండ్ మార్కెట్ జోరుగానే ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం దిగివస్తోంది. మరోవైపు రేట్ల నిర్ణయం విషయంలో విధానాల మార్పు కారణంగా ఆర్బీఐ పాలసీ సరళంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా బహిరంగ మార్కెట్ కార్యకలాపాల జోరును పెంచుతోంది. బహిరంగ మార్కెట్ కార్యకలాపాల్లో భాగంగా ఆర్బీఐ ప్రభుత్వ బాండ్లను జోరుగా కొనుగోలు చేస్తోంది. ... ఇవన్నీ బాండ్ మార్కెట్‌కు సానుకూలాంశాలే అని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలను మించి మార్కెట్ రుణాలను సమీకరించనుండటం, కేంద్ర ప్రభుత్వ ద్రవ్య స్థితిగతులు, ద్రవ్యోల్బణ సంబంధిత రిస్క్‌లు ....ఇవన్నీ రానున్న నెలల్లో బాండ్ మార్కెట్‌పై ప్రభావం చూపే ప్రతికూలాంశాలు. పరిస్థితులను బట్టి వ్యూహాలు... ఇన్వెస్టర్లు ఒకింత రిస్క్ భరించగలిగేతే బాండ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. బాండ్ల ధరలు ర్యాలీ జరిపితే డైనమిక్ బాండ్ ఫండ్స్ లాభపడతాయి. డైనమిక్ బాండ్ ఫండ్స్‌కు వడ్డీరేట్ల హెచ్చుతగ్గులే కీలకం. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్‌బాండ్ ఫండ్ (గతంలో దీనిని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ ప్లాన్‌గా వ్యవహిరించేవారు) విషయానికొస్తే, వివిధ వడ్డీ రేట్ల కాలాల్లో నిలకడైన రాబడులనిచ్చింది. 2014–2016 మధ్య కాలంలో ఈ ఫండ్ 16–19 శాతం రేంజ్లో రాబడులనిచ్చింది. లాంగ్‌టర్మ్ గిల్ట్‌ఫండ్స్ 2–3 శాతమే రాబడులనిచ్చిన 2017లో ఈ ఫండ్ 5 శాతం వరకూ రాబడినిచ్చింది. ఒడిదుడుకుల పరిస్థితుల్లో బాండ్లు/డిబెంచర్లు/కమర్షియల్ పేపర్ వంటి సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కాలపరిమితిని సమర్థవంతంగా నిర్వహించడం, పరిస్థితులు బాగా ఉన్నప్పుడు ర్యాలీలను క్యాష్ చేసుకోవడం వంటి వ్యూహాలను పాటించడం ద్వారా ఈ ఫండ్ నష్టాలను తగ్గించుకోగలిగింది. ఈ కేటగిరిలో ఫండ్స్ కంటే మెరుగైన రాబడులనివ్వగలిగింది. ఇక ఐదు, పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నా, ఈ ఫండ్ వార్షిక రాబడులు 9–10 శాతం రేంజ్లో ఉన్నాయి. ఈ కాలంలో ఈ కేటగిరీ ఫండ్ల సగటు రాబడి దీనికంటే తక్కువగా వుంది. రెండు–మూడేళ్లు ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు ఈ డైనమిక్ బాండ్ ఫండ్‌ను పరిశీలించవచ్చు. చురుకైన మెచ్యూరిటీ మేనేజ్మెంట్ బాండ్ల ధరల అధారంగా డెట్ ఫండ్ ఎన్ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) పెరగడం, తగ్గడం ఉంటుంది. వడ్డీరేట్ల కదలికలు బాండ్ల ధరలను ప్రభావితం చేస్తాయి. వడ్డీరేట్లు పెరిగితే, బాండ్ల ధరలు తగ్గుతాయి. అలాగే వడ్డీరేట్లు తగ్గితే బాండ్ల రేట్లు పెరుగుతాయి. కాలపరిమితి అధికంగా ఉండే బాండ్ల రాబడులు మరింత సున్నితంగా ఉంటాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షి యల్ ఆల్ సీజన్స్‌బాండ్ ఫండ్.. బాండ్లలో ఇన్వెస్ట్‌చేసే సగటు మెచ్యూరిటీ కాలం 4–20 ఏళ్లుగాఉంది. గత ఏడాది జూలై–అక్టోబర్ మధ్య ఈ సగటు మె చ్యూరిటీ కాలం 1.5–2 సంవత్సరాలు గానూ, గత 2 నెలల్లో 3–5 సంవత్సరాలు గానూ ఉంది. మెచ్యురిటీ డ్యురేషన్ ఇంత యాక్టివ్‌గా ఉండటం వల్ల మధ్యంతర బాండ్ ర్యాలీ ప్రయోజనాలను ఈ బాండ్ అందిపుచ్చుకోవడమే కాకుండా ఈ కేటగిరీలో మంచి రాబడులనిస్తోన్న ఫండ్‌గా నిలుస్తోంది. -
బాండ్ మార్కెట్ రూపం మారుతోంది!
ఆర్బీఐ సంస్కరణల ఫలితం భారత రిజర్వ్ బ్యాంక్ గత నెలలో బాండ్ మార్కెట్‌కు సంబంధించి భారీ సంస్కరణలను ప్రకటించింది. వీటి ఫలితంగా ఇన్వెస్టర్లు, కంపెనీలకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీగా ప్రయోజనం చేకూరనుంది. సంస్కరణల్లో ముఖ్యాంశాలు.. * మసాలా బాండ్ల (విదేశాల్లో రూపాయి డినామినేషన్లో జారీచేసే బాండ్లు) ద్వారా నిధులు సమీకరించడానికి బ్యాంక్‌లకు అనుమతినివ్వడం * బాండ్ మార్కెట్ ద్వారా నిధులు సమీకరించేలా కంపెనీలను ప్రోత్సహించడం. * బాండ్ల బదిలీపై నిషేధాలు తొలగించడం ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా బాండ్ మార్కెట్లో లావాదేవీలు జరిపేందుకు ప్రోత్సాహాన్నివ్వడం. * ఫారెక్స్ మార్కెట్లో 3 కోట్ల డాలర్ల వరకూ హెడ్జింగ్ చేసుకోవడానికి కంపెనీలను అనుమతించడం, 50 లక్షల డాలర్ల వరకూ ఓపెన్ పొజిషన్లు తీసుకునే వెసులుబాటు కల్పించడం. * కార్పొరేట్ బాండ్ మార్కెట్లో లావాదేవీలు జరపడానికి ఎఫ్ఐఐలను అనుమతించడం. ఈ సంస్కరణల వల్ల ఏం జరుగుతుందంటే.. * బాండ్లకు డిమాండ్, సరఫరా పెరుగుతుంది. * బాండ్ మార్కెట్లో లిక్విడిటీ మెరుగుపడుతుంది. లిక్విడిటీ మెరుగుపడడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది. * పెట్టిన పెట్టుబడులపై రాబడులతో పాటు మూలధన లాభాలు పొందే అవకాశాలున్నాయి. * బ్యాంక్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా బాండ్లను ఇన్వెస్టర్లు పరిశీలిస్తారు. * ఫారెక్స్ మార్కెట్లో భారీ అవకాశాలు లభిస్తాయి. అయితే బాండ్ మార్కెట్లో మరిన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం చాలా ఉంది. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి జీవిత బీమా సంస్థలు, ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌ను అనుమతించాలి. ఆర్బీఐ తాజా సంస్కరణల ఫలాలు అందడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇన్వెస్టర్లు మదుపు చేయడానికి మరిన్ని మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. -
టిక్.. టిక్..ఫెడ్ !
ప్రపంచం చూపు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైపు... రేట్ల పెంపుపై రేపు సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం అదే జరిగితే ప్రపంచ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు అంచనాలు... అటు-ఇటూ! ప్రభావాన్ని ఎదుర్కొంటామంటున్న భారత్ ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘సెప్టెంబర్ 17’వ తేదీ వచ్చేస్తోంది. ఆ రోజున అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పస్తుతం 0-0.25 శాతం వున్న ఫెడ్ ఫండ్స్ రేటును పెంచే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలే దీనికి కారణం. ఇదే జరిగితే 9 సంవత్సరాల తర్వాత అమెరికా ఈ రేటు పెంచినట్లవుతుంది. అవకాశాలు తక్కువే: బాండ్ మార్కెట్ అమెరికాలోని బాండ్ మార్కెట్ మాత్రం రేటు పెంపు అవకాశాలు తక్కువేనని భావిస్తోంది. ఇందుకు కేవలం 20 శాతం అవకాశాలే ఉన్నాయని అంచనా వేస్తోంది. ఇది కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది బాండ్ మార్కెట్ అంచనా. ప్రపంచ అస్పష్ట మార్కెట్ పరిస్థితులు దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడుతోంది. అయితే ఏదైనా ఆశ్చర్యకరమైన నిర్ణయం చోటుచేసుకుంటే మాత్రం మార్కెట్లో భారీ కదలికలు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. కఠినమా... సరళమా..? ఒక్క అమెరికా సానుకూల పరిస్థితులను పరిగణించి ఫెడ్ కఠిన విధానం అవలంబిస్తుందా? లేక మొత్తం ప్రపంచ అనిశ్చితి పరిస్థితులను అనుసరించి సరళతర విధానం అవలంబిస్తుందా? అన్న అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. వాటిని క్లుప్తంగా చూస్తే... ఇప్పటికి ఇప్పుడు పెంపు ఉండదు. అయితే అక్టోబర్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని ఫెడ్ కమిటీ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి నిర్ణయం తక్షణం అమెరికా బాండ్ మార్కెట్‌కు, డాలర్‌కు కలిసి వచ్చేదే. స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అనిశ్చితి కొనసాగుతుంది. 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంపును అమెరికా ఆర్థిక ఫండమెంటల్స్ అనుమతినిస్తున్నాయి. చైనా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల మందగమనం సమస్యలు ఫెడ్‌కు తెలుసు. అయితే ఇవేమీ ప్రస్తుత రేటు పెంపునకు భారీ అడ్డంకి కాకపోవచ్చు. మున్ముందు పరిస్థితి మరింత బాగుంటే డిసెంబర్లో మరో 25 బేసిస్ పాయింట్ల రుణ రేటు పెంపు అవకాశమూ ఉంది. ఆర్థిక పరిస్థితులు చక్కబడితే 25 బేసిస్ పాయింట్లు రేటు పెంపు ఉంటుందని ఫెడ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితులు ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. ఇలా జరిగితే ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ పరిణామాలు ఎంతకాలం ఎలా ఉంటాయన్నది పరిశీలించాల్సి ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా రేట్ల పెంపు ఆలస్యం అవుతుంది. ఈ ఏడాది చివరికి ఈ నిర్ణయం వాయిదా పడవచ్చు. అనిశ్చితి కొనసాగడం ప్రతికూలంశమే. ఫెడ్ తీరు పూర్తి సరళమే. ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు పెంచితే తీవ్ర ప్రతికూల ఫలితాలు అంతర్జాతీయంగా తలెత్తవచ్చు. ఈ కారణాల వల్ల 2015లో రేట్ల పెంపు వుండకపోవచ్చు. ఇదే జరిగితే ఈక్విటీ మార్కెట్లో భారీ ర్యాలీ చోటుచేసుకుంటుంది. ఎందుకింత ఉత్కంఠ..! 2008 ఆర్థిక సంక్షోభాన్నుంచి గట్టెక్కి, వృద్ధికి ఊపును అందించడానికి ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధుల్ని కుమ్మరించడం. రెండవది తక్కువ వడ్డీరేటుకు రుణాలను అందించడం కోసం ఫండ్స్ రేటు జీరో స్థాయికి తగ్గించడం. ఫండ్స్ రేటు తగ్గడాన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే- అతి తక్కువ రేటుకు బ్యాంకులకు రుణాలు లభిస్తాయన్నమాట. ఇలా లభించిన చౌక మొత్తాలను మార్కెట్లో చౌకగా బ్యాంకులు రుణాలిచ్చాయి. అమెరికా ఇన్వెస్టర్లు ప్రపంచ వ్యాప్తంగా షేర్లు, కమోడిటీలు తదితరాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆర్థిక వ్యవస్థ కుదుటపడిన తర్వాత ఫెడ్ ఈ ఉద్దీపన ఎప్పటికైనా వెనక్కు తీసుకోక తప్పదు. ఇందులో భాగంగా ప్రతీ నెలా బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంపించే నిధుల్ని గతంలోనే ఫెడ్ నిలుపుచేసింది. అయితే అమెరికా ఆర్థిక పరిస్థితుల క్లిష్టత దృష్ట్యా ఎప్పటికప్పుడు ‘రేట్ల పెంపు’ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 0.6 శాతం అమెరికా ఆర్థికాభివృద్ధి నమోదయితే, రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) వృద్ధి 3.7 శాతంగా నమోదయింది. ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రేట్ల పెంపు పై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం 0-0.25 శాతంగా ఉన్న ఈ రేటు ఏ మాత్రం పెరిగినా... అమెరికా ఇన్వెస్టర్లపై వడ్డీ వ్యయ భారం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వారు వివిధ దేశాల్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కు తీసుకువెళ్లి... రుణ పునః చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇదే జరిగితే పలు ప్రపంచ దేశాలు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) కొరత పరిస్థితులను ఎదుర్కొనవచ్చు. వెరసి తిరిగి పలు దేశాలు ఆర్థిక మందగమనంలోకి జారుకునే అవకాశం ఉంది. భారత్ పరిస్థితి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భారత్‌సహా పలు దేశాలు అమెరికాకు సూచిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే- ఫెడ్ జాగరూకతతో నిర్ణయం తీసుకుంటుందని ఒకపక్క పేర్కొంటూనే... మరోపక్క ఒకవేళ ఫెడ్ రేటు పెరిగితే ఆ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధమై ఉన్నామని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. స్వయంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్ లాంటి ఉన్నత స్థాయి అధికారులు సైతం ఇదే విధమైన ప్రకటనలు చేశారు. కాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంచితే భారత్‌కు సానుకూలమేనని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్ పేర్కొంటోంది. ఫెడ్ నిర్ణయం ఆలస్యం అయిన కొద్దీ దేశంలోకి పెట్టుబడుల ప్రవాహంలో అనిశ్చితి నెలకొంటుందని, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడతాయని పేర్కొంది. త్వరగా ఈ అంశం తేలిపోతే చక్కటి ఇన్వెస్ట్‌మెంట్‌కు తగిన దేశంగా భారత్‌కు భారీ పెట్టుబడులు ఖాయమన్నది ఆ సంస్థ విశ్లేషించింది.