ఆర్‌బీఐ సంస్కరణల ఫలితం
భారత రిజర్వ్ బ్యాంక్ గత నెలలో బాండ్ మార్కెట్‌కు సంబంధించి భారీ సంస్కరణలను ప్రకటించింది. వీటి ఫలితంగా ఇన్వెస్టర్లు, కంపెనీలకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీగా ప్రయోజనం చేకూరనుంది.
సంస్కరణల్లో ముఖ్యాంశాలు..
* మసాలా బాండ్ల (విదేశాల్లో రూపాయి డినామినేషన్లో జారీచేసే బాండ్లు) ద్వారా నిధులు సమీకరించడానికి బ్యాంక్‌లకు అనుమతినివ్వడం
* బాండ్ మార్కెట్ ద్వారా నిధులు సమీకరించేలా కంపెనీలను ప్రోత్సహించడం.
* బాండ్ల బదిలీపై నిషేధాలు తొలగించడం ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా బాండ్ మార్కెట్లో లావాదేవీలు జరిపేందుకు ప్రోత్సాహాన్నివ్వడం.
* ఫారెక్స్ మార్కెట్లో 3 కోట్ల డాలర్ల వరకూ హెడ్జింగ్ చేసుకోవడానికి కంపెనీలను అనుమతించడం, 50 లక్షల డాలర్ల వరకూ ఓపెన్ పొజిషన్లు తీసుకునే వెసులుబాటు కల్పించడం.
* కార్పొరేట్ బాండ్ మార్కెట్లో లావాదేవీలు జరపడానికి ఎఫ్‌ఐఐలను అనుమతించడం.
ఈ సంస్కరణల వల్ల ఏం జరుగుతుందంటే..
* బాండ్లకు డిమాండ్, సరఫరా పెరుగుతుంది.
* బాండ్ మార్కెట్లో లిక్విడిటీ మెరుగుపడుతుంది. లిక్విడిటీ మెరుగుపడడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది.
* పెట్టిన పెట్టుబడులపై రాబడులతో పాటు మూలధన లాభాలు పొందే అవకాశాలున్నాయి.
* బ్యాంక్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా బాండ్లను ఇన్వెస్టర్లు పరిశీలిస్తారు.
* ఫారెక్స్ మార్కెట్లో భారీ అవకాశాలు లభిస్తాయి.
అయితే బాండ్ మార్కెట్లో మరిన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం చాలా ఉంది. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి జీవిత బీమా సంస్థలు, ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌ను అనుమతించాలి. ఆర్‌బీఐ తాజా సంస్కరణల ఫలాలు అందడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇన్వెస్టర్లు మదుపు చేయడానికి మరిన్ని మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి.
బాండ్ మార్కెట్ రూపం మారుతోంది!
Published Mon, Sep 19 2016 2:20 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
Advertisement