సమ్మర్‌లో ఏదీ పడేతే అది తినకూడదు. సూర్యుడి భగ భగలకి దాహం దాహం అన్నట్లు ఉంటుంది. ఎక్కువ ఆహారం తినలేం. చల్లటి పానీయాలే తీసుకోవాలని పిస్తుంది. అలా అని కూల్‌డ్రింక్స్ వంటివి తాగితే ఇక అంతే సంగతులు. చేజేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నవారవ్వుతారు. ఇలాంటి హాట్ సమ్మర్‌లో ఎలాంటి పదార్థాలు తింటే మంచిది, వేటికి దూరంగా ఉంటే బెటర్ తెలుసుకుందామా!.
వేసవి అనగానే వాతావరణం ఉక్కపోతలతో చిరాకు తెప్పిస్తుంటుంది. దీంతో చాలా మంది చల్లదనం కోసం తహతహలాడుతుంటారు. ఈ సమయంలో ఎక్కువగా దాహం వేస్తుంది. అయితే కొందరు కారం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతమైన దాహం వేస్తుంది. దీంతో ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల డైజేషన్ సమస్యలు వస్తాయి. కుడుపు ఉబ్బరంగా ఉండి అలసట ఏర్పడుతుంది. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగా స్పైస్ ఫుడ్ను అవైడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు అవితీసుకోకుండా ఉండటమే మంచిది.
వేసవి కాలంలో శరీరం ఎక్కువగా డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి చల్లదనం చేసే ద్రవపదార్థాలు తీసుకోవాలి. అంటే టీ, కాఫీలు తగ్గించాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరం తేమ కోల్పోయిన నిర్జీవంగా తయారై అనారోగ్యం ఏర్పడవచ్చు.
మాంసాహారం అనగానే చాలా మంది లొట్టలేసుకొని తింటారు. వేసవిలో ఇవి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇవి జీర్ణక్రియను మందగించడమే కాకుండా ఒక్కోసారి కడుపులో సమస్యలు వచ్చి విరేచనాలు రావొచ్చు. అలాగే వేపుళ్లు, పచ్చళ్లను సైతం ఈ కాలంలో అవైడ్ చేయాలి. వీటికి బదులు పెరుగన్నం, తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. లేకపోతే అనేక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
వేసవిలో ఫ్రైడ్‌ఫుడ్స్, జంక్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. అసలే ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుందంటే.. ఇక వీటిని తింటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. చాలామంది ఎండలోంచి ఇంటికి రాగానే.. లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఎండ వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్.. వంటివి తీసుకుంటుంటారు. అయితే ఇవి వేసవి వేడి నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ శరీరంలో అత్యధికంగా వేడి ఉత్పత్తయ్యేలా చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment