సాక్షి, న్యూఢిల్లీ: స్పైస్ బ్రాండ్ సరికొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. చైనాకు చెందిన ట్రాన్సిషన్ హోల్డింగ్స్, దేశీయ కంపెనీ స్పైస్ మొబిలిటీ జాయింట్ వెంచర్ కంపెనీ బుధవారం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎఫ్311 పేరుతో ఇండియన్ మార్కెట్లో దీన్ని విడుదల చేసింది. దీని ధరను రూ .5,599 గా నిర్ణయించింది. ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, రియర్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్‌సెన్సర్ ప్రత్యక ఆకర్షణ. అంతేకాదు ఒక ఏడాది రీప్లేస్‌మెంట్ వారంటీ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.
ఎఫ్311 ఫీచర్లు
5.45-అంగుళాల స్క్రీన్, 18: 9 కారక నిష్పత్తి
ఆండ్రాయిడ్ ఓరియో 8.1
480x960 రిజల్యూషన్
1జీబీర్యామ్, 16జీబీ స్టెరేజ్
32 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
5ఎంపీ సెల్ఫీ కెమెరా
5ఎంపీ రియర్ కెమెరా
2400 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment