సాక్షి, చెన్నై: ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చేందుకు దివంగత సీఎం జె.జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సిద్ధమవుతున్నారు. నేనొస్తున్నా అంటూ కేడర్‌ను ఉద్దేశించి ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు చిన్నమ్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు.
తాజాగా కేడర్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఈ మేరకు తాజా ప్రకటనలో నేనొస్తున్నా అంటూ సంకేతాన్ని కేడర్‌లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment