
జెనీలియా రీఎంట్రీ
తమిళసినిమా : కొందరు తారామణులు వివాహానంతరం నటనను కొనసాగిస్తుంటే మరి కొందరు పెళ్లి తరువాత నటనకు కొంత కాలం గ్యాప్ ఇచ్చి ఒకరిద్దరు పిల్లల్లి కన్నతర్వాత రీఎంట్రీ అవుతుంటారు. నటి జెనీలియా రెండవ కోవకు చెందిన హీరోయిన్ల జాబితాలో చేరుతున్నారు.ఈ బ్యూటీకి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తమిళ, తెలుగు, హిందీ తదితర భాషలలో హీరోయిన్‌గా నటించి తనకంటూ పత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తమిళంలో విజయ్, ధనుష్, జయం రవి, సిద్ధార్థ్ వంటి స్టార్ హీరోలతో నటించారు. బాయ్స్, సంతోష్ సుబ్రమణియన్, వేలాయుధం తదితర చిత్రాలు జెనీలియాకు పేరు తెచ్చిపెట్టాయి.
తెలుగులోనూ బొమ్మరిల్లు, రెడీ లాంటి పలు చిత్రాలు ఈ ఉత్తరాది భామ కేరీర్ ఎదుగుదలకు దోహదం చేశాయి. నటిగా మంచి స్ప్రింగ్‌లో ఉండగానే హిందీ నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం రితేష్ దేశ్ ముఖ్‌కు ఇష్టం లేకపోవడంతో జెనీలియా నటనకు దూరంగా ఉన్నారు. మగబిడ్డకు జన్మనిచ్చిన ఈమె ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. ఆల్‌రెడీ రెండు కమర్శియల్ ప్రకటనల్లో నటించిన జెనీలియా ఇప్పుడు ఒక హిందీ చిత్రానికి సైన్ చేశారని సమాచారం. మూడేళ్ల తరువాత షూటింగ్‌లో పాల్గోనడం సంతోషంగా ఉందని జెనీలియా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భర్త ఆల్ ది బెస్ట్ చెప్పడం విశేషం.