రీఎంట్రీ ఇస్తున్న మహేశ్‌ సోదరి.. ఫస్ట్‌ లుక్‌ అవుట్‌ | Manjula Ghattamaneni Re Entry With Malli Modalaindi Movie First Look Out | Sakshi
Sakshi News home page

Manjula Ghattamaneni: రీఎంట్రీకి రెడీ..

Published Mon, Aug 9 2021 4:13 PM | Last Updated on Mon, Aug 9 2021 5:21 PM

Manjula Ghattamaneni Re Entry With Malli Modalaindi Movie First Look Out - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సోదరి మంజుల ఘట్టమనేని.. సిల్కర్‌ స్క్రీన్‌పై మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సుమంత్‌, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతోన్న మళ్లీ మొదలైంది చిత్రం ద్వారా రీఎంట్రీకి సిద్దమయ్యారు. ఇటీవలె విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంజుల 'డాక్టర్ మిత్ర'-థెరపిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మూవీ విడుదల తేదీపై ఎగ్జయిటెడ్‌గా ఉన్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా 1998లో స‌మ్మ‌ర్ ఇన్ బెత్తెహామ్ సినిమాతో తొలిసారి వెండితెరకు  కనిపించిన మంజుల ఆ తర్వాత నాని సినిమాతో నిర్మాత‌గా మారింది. పోకిరి, కావ్యాస్ డైరీ, యే మాయ చేశావే చిత్రాల‌ను నిర్మించి సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందింది ఆ తర్వాత 2018లో మ‌న‌సుకు న‌చ్చింది సినిమాకు దర్శకత్వం వహించింది. చివరగా 2013లో సేవకుడు చిత్రంలో కనిపించారు. మళ్లీ దాదాపు ఎనిమిదేళ్ల అనంతరంనటిగా వెండితెరపై కనిపించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement